రాష్ట్రీయం

ఆన్‌లైన్‌లో చేనేత వస్త్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేత కార్మికులకు బీమా, 35 కిలోల బియ్యం ప్రతి జిల్లాలో చేనేత మెగా షోరూమ్‌లు

హైదరాబాద్, నవంబర్ 30: చేనేత వస్త్రాల అమ్మకాలను పెంచే విధంగా ఆన్‌లైన్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి జిల్లా కేంద్రంలో చేనేత మెగా షోరూమ్‌ను ఏర్పాటు చేస్తారు, హైదరాబాద్‌లో రెండు షో రూమ్‌లను ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో చేనేత కార్మికులకు లబ్ది కలిగే విధంగా వారి సంక్షేమంకోసం చేపట్టాల్సిన చర్యలపై ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుటెస్కో అధికారులతో సమావేశం నిర్వహించారు. తెలంగాణలో గత ఐదేళ్ల నుంచి చేనేత కార్మికుల వేతన సవరణ చేయనందున, ప్రతిపాదనలు రూపొందించేందుకు తక్షణం అధికారులతో కమిటీ వేయాలని నిర్ణయించారు. చేనేత వృత్తిని లాభసాటిగా మార్చేందుకు అవసరం అయిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డైరెక్ట్ మార్కెట్ కోసం ఆన్‌లైన్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని ఆదేశించారు. టెస్కో షోరూమ్‌లను ఆధునీకరించాలని నిర్ణయించారు. (ఉమ్మడి రాష్ట్రంలో ఆప్కో విభజన తరువాత టెస్కోగా పేరు మారింది) టెస్కో సొసైటీలన్నింటికీ సిఎఫ్‌సి బిల్డింగ్‌లు, గోదాములు నిర్మించేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని కోరారు. 60 ఏళ్లు దాటిన చేనేత కార్మికులకు బునకర్ బీమా యోజన అమలు చేసేందుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. చేనేత కార్మికులకు పెండింగ్‌లో ఉన్న పావలా వడ్డీ రాయితీలను వెంటనే చెల్లించాలని తెలిపారు. ఆహార భద్రత చట్టం అమలులోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికులకు కూడా అంత్యోదయ కార్డులు తగ్గాయని, వారికి అంత్యోదయ కార్డులు ఇవ్వడానికి చేనేత శాఖ బడ్జెట్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. అంత్యోదయ కార్డుల ద్వారా 35 కిలోల బియ్యం ఇచ్చే విధంగా ప్రతిపాదనలు రూపొందించాలని మంత్రులు ఆదేశించారు. ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్‌ను సమావేశానికి పిలిచి, ఆర్థిక శాఖ నుంచి టిస్కోకు రావలసిన బకాయిలు విడుదల చేయాలని కోరారు. తెలంగాణ చేనేత సంఘాలకు మాత్రమే బకాయిలు విడుదల చేసే విధంగా ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. పాశమైలారంలో టెక్స్‌టైల్ పార్కులో వివిధ పనుల గురించి చర్చించారు.