రాష్ట్రీయం

ఒవైసీకి ప్రజలే బుద్ధి చెబుతారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర మంత్రి హన్సరాజ్ గంగారాం
రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరిస్తాం

నిజామాబాద్, మార్చి 17: ‘్భరత్ మాతా కీ జై’ అని నినదించే ప్రసక్తే లేదంటూ ఎఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం తీవ్రంగా ఖండించారు. అసదుద్దీన్‌కు దేశ ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని ఆయన హెచ్చరించారు. బిజెపి జిల్లా అధ్యక్షుడిగా వరుసగా రెండవ పర్యాయం ఎన్నికైన పల్లె గంగారెడ్డి గురువారం జిల్లా కేంద్రంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, హన్స్‌రాజ్ గంగారాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారతదేశంలో పుట్టిన ప్రతిఒక్కరూ భారత్ మాతా కీ జై అనాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.ఇది దేశభక్తికి సంబంధించిన విషయం తప్ప, ఏ ఒక్క మతానికో చెందిన అంశం ఎంతమాత్రం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మూతబడ్డ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని త్వరలోనే పునరుద్ధరిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఈ కర్మాగారం పునరుద్ధరణ కోసం ఐదు వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తామని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేసేందుకు కేంద్రం చర్యలు చేపడుతోందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమవుతోంది తప్ప, ఆశించిన స్థాయిలో అభివృద్ధి కానరావడం లేదని గంగారాం ఆక్షేపించారు. కేంద్రం అందిస్తున్న సబ్సిడీతోనే తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం రూపాయికి కిలో బియ్యం పథకాన్ని అమలు చేస్తోందన్నారు.