రాష్ట్రీయం

వేధింపుల వివాదానికి తెర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజీకొచ్చిన గాయని మధుప్రియ, శ్రీకాంత్

హైదరాబాద్, మార్చి 13: గాయని మధుప్రియ కేసు కొత్త మలుపు తిరిగింది. దంపతుల మధ్య ఏర్పడిన వివాదం పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. అనేక నాటకీయ పరిణామాల మధ్య 24 గంటల పాటు సాగిన ఈ వేధింపుల వివాదానికి తెరపడింది. పోలీస్ కౌనె్సలింగ్‌తో దంపతులిద్దరు రాజీకొచ్చారు. పోలీసులు, మానసిక వైద్యులు నిర్వహించిన కౌనె్సలింగ్‌లో తానే తొందర పడ్డానంటూ శ్రీకాంత్, ఆవేశంలో పోలీసులకు ఫిర్యాదు చేశానని మధుప్రియ చెప్పుకొచ్చారు. అయితే తాను కొంతకాలం తల్లిదండ్రుల వద్దే ఉంటానని మధుప్రియ చెప్పింది. విడివిడిగా నాలుగు గంటల పాటు కౌనె్సలింగ్ నిర్వహించామని, ఇద్దరు రాజీకి వచ్చారని హుమాయున్‌నగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవీందర్ తెలిపారు. మధుప్రియ, శ్రీకాంత్ నాలుగు నెలల క్రితం ప్రేమవివాహం చేసుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా శ్రీకాంత్ తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ మధుప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
అసలు ఏం జరిగిందంటే..
కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి చెందిన పెద్దింటి మల్లేశ్, సుజాత దంపతుల రెండో కుమార్తె మధుప్రియ ఆడపిల్లనమ్మా.. అనే పాటతో వర్ధమాన నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన శ్రీకాంత్‌తో ఏర్పడిన పరిచయం పెళ్లి వరకు వెళ్లింది. తల్లిదండ్రులను కాదని మధుప్రియ ప్రేమించిన శ్రీకాంత్‌ను గత అక్టోబర్ 30న పెళ్లి చేసుకున్నారు. మూడు నెలలు సాఫీగా సాగిన వైవాహిక జీవితంలో కట్న పిశాచి ప్రవేశించింది. శ్రీకాంత్ అత్తగారి ఇంటినుంచి డబ్బులు తేవాలంటూ తరచూ వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో హుమాయున్‌నగర్ పోచమ్మబస్తీలో నివాసముంటున్న మధుప్రియ శనివారం సాయంత్రం శ్రీకాంత్ వేధింపులపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు శ్రీకాంత్‌పై 498ఏ, 506, 323 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రామంతాపూర్‌లో నివాసముంటున్న తల్లిదండ్రుల వద్దకు మధుప్రియ వెళ్లిపోయారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఎందుకు చేశావని అడిగేందుకు ఆదివారం తెల్లవారు జామున శ్రీకాంత్ అత్తవారింటికి వెళ్లాడు. అక్కడ మధుప్రియ బంధువులు తనపై దాడికి పాల్పడ్డారని, తాను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలావుండగా శ్రీకాంత్ తన స్నేహితులతో కలసి తమ ఇంటిపై దాడికి పాల్పడినట్టు మధుప్రియ తల్లిదండ్రులు ఉప్పల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మధుప్రియ, శ్రీకాంత్ దంపతులకు హుమాయున్‌నగర్ పోలీసులు దాదాపు నాలుగు గంటలపాటు మానసిక వైద్యులతో కౌనె్సలింగ్ నిర్వహించారు. ఇద్దరు ఆవేశంలో పరస్పర ఆరోపణలు చేసుకున్నామని, ఇక నుంచి కలిసి ఉంటామని చెప్పగా పోలీసులు దంపతులిద్దరిని ఒకటిగా చేశారు. మొదటి దశగా కౌనె్సలింగ్ నిర్వహించి పంపుతున్నామని, మరోసారి ఇలాగే ప్రవర్తిస్తే అప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తామని పోలీసులు తెలిపారు.