రాష్ట్రీయం

పుద్దూరు వద్ద నిర్మాణాలు ఆపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు
హైదరాబాద్, నవంబర్ 23: మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల్ మండలం పుద్దూర్ వద్ద జరుగుతున్న నిర్మాణాలను ఆపాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అక్కడ జరుగుతున్న వ్యాపార లావాదేవీలను, గొడౌన్ల నిర్వహణను ఆపాలని స్పష్టం చేసింది. మహబూబ్‌నగర్‌కు చెందిన జి.కృష్ణారెడ్డి దాకలు చేసిన పిటీషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. 24 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి అనుమతి లేకుండా నిర్మిస్తున్న గొడౌన్ల నిర్మాణాలు ఆపేవిధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆ పిటీషన్‌లో హైకోర్టును కోరారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని నిర్మాణాలు జరుగుతుంటే సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. అక్కడ జరిగే అన్ని రకాల నిర్మాణాలు, ఆపరేషన్స్‌ను వెంటనే నిలిపివేస్తూ స్టే మంజూరు చేసింది. అనంతరం ఈ కేసును 8 వారాలు వాయిదా వేసింది.