సబ్ ఫీచర్

మాటల్లో చెప్పలేనిది.. మాతృత్వపు మాధుర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడు దశాబ్దాల తర్వాత ఆమె ఇపుడు మళ్లీ చరిత్ర సృష్టించింది.. దేశంలో తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీగా ముంబయిలో 1986లో జన్మించిన హర్ష చావ్దా సోమవారం నాడు పండంటి మగశిశువును ప్రసవించింది. 2015లో దివ్యపాల్ షాను ఆమె వివాహం చేసుకుంది. గత ఏడాది గర్భం దాల్చిన ఆమెకు ముంబయిలోని కెఇఎం ఆసుపత్రిలో వైద్యులు సిజేరియన్ శస్తచ్రికిత్స చేశారు. మగశిశువుకు జన్మనిచ్చిన సందర్భంగా హర్ష ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతూ- ‘30 ఏళ్ల క్రితం నేను టెస్ట్‌ట్యూబ్ బేబీగా జన్మించడం దేవుడి కృపకు నిదర్శనం.. నాకు పుట్టిన బిడ్డకూడా భగవంతుడి కానుక..’ అని చెబుతోంది. తాను ఇపుడు మాతృత్వపు మమకారాన్ని ఆస్వాదిస్తున్నానని, తన సంతోషాన్ని చెప్పేందుకు మాటలు చాలవని ఆమె ఎంతో ఉద్వేగంతో అంటోంది. తన భార్య హర్ష గర్భం దాల్చాక ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా ఉండేందుకు ఉద్యోగాన్ని వదిలేసిందని, ఆమె ఆశలు ఫలించి బిడ్డకు జన్మనిచ్చిందని భర్త దివ్యపాల్ అంటున్నారు.
1986లో టెస్ట్‌ట్యూబ్ బేబీగా హర్ష జన్మించినపుడు వైద్యసేవలు అందించిన సంతాన సాఫల్య నిపుణురాలు డాక్టర్ ఇందిరా హిందుజా ఇపుడు ఆమెకు సిజేరియన్ శస్తచ్రికిత్స చేయడం విశేషం. హర్షకు పుట్టిన మగశిశువు 3.18 కిలోల బరువుతో ఎంతో ఆరోగ్యవంతంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. తమ ఆస్పత్రి వైద్యుల ద్వారా ఇంతవరకూ పదిహేను వేల మంది టెస్ట్‌ట్యూబ్ బేబీలు జన్మించారని డాక్టర్ ఇందిర చెబుతున్నారు. టెస్ట్‌ట్యూబ్ బేబీలుగా పుట్టిన వారు కూడా గర్భం దాల్చి సహజ పద్ధతుల్లోనే ప్రసవిస్తున్నారని, అయితే కొన్ని కారణాల రీత్యా హర్షకు సిజేరియన్ శస్తచ్రికిత్స చేయాల్సి వచ్చిందని ఆమె చెప్పారు. కాగా, చెన్నైలోని జిజి ఆస్పత్రిలో 1990లో టెస్ట్‌ట్యూబ్ బేబీగా జన్మించిన కమలారత్నం అదే ఆస్పత్రిలో 2014లో సిజేరియన్ అవసరం లేకుండానే బిడ్డకు జన్మనిచ్చింది. దక్షిణ భారతదేశంలో తల్లయిన తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీగా కమల రెండేళ్ల క్రితమే రికార్డు సృష్టించింది. (చిత్రం) మగశిశువుకు జన్మనిచ్చిన తొలి టెస్టుట్యూబ్ బేబీ హర్షచావ్దా