రాష్ట్రీయం

ఉద్యాన శాఖ ఉద్యోగుల రిలీవ్‌పై హైకోర్టులో విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 28: ఉద్యాన శాఖ ఉద్యోగులను రిలీవ్ చేయడంపై హైకోర్టు సోమవారం నాడు విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం ఉద్యానవన శాఖకు చెందిన 33 మంది ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులను ఇటీవల రిలీవ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలవడంతో హైకోర్టు ఈ విచారణ చేపట్టింది. ఉద్యాన శాఖ ఉద్యోగుల విభజనపై 8 వారాల్లోగా విధివిధానాలను రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అప్పటివరకూ వీరిని కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 20వ తేదీకి వాయిదా వేసింది.
హెల్మెట్ ధరకు మించి జరిమానా వేయండి: హైకోర్టు
తెలంగాణ రాష్ట్రంలో హెల్మెట్ల వాడకంపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. హెల్మెట్లు ధరించని వాహన చోదకులపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోతే హెల్మెట్ ధర కంటే ఎక్కువ జరిమానా విధించాలని న్యాయస్థానం ఆదేశించింది. చైన్ స్నాచింగ్‌ల కారణంగా హెల్మట్‌ల వాడకంపై కఠినంగా వ్యవహరించడం లేదని తెలంగాణ ఎజి చేసిన వాదనపై హైకోర్టు అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది.