రాష్ట్రీయం

హైదరాబాద్ విద్యార్థికి మెడిసిన్‌లో టాప్‌ర్యాంక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంసెట్ ఫలితాలు విడుదల 12 నుంచి ర్యాంక్ కార్డుల డౌన్‌లోడ్
జూన్ 19 నుంచి తరగతులు

విజయవాడ (ఎడ్యుకేషన్), మే 5: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాలు-2017 విడుదలయ్యా యి. ఎంసెట్ ఇంజనీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ ఫలితాలను మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి శుక్రవారం విజయవాడలోని హోటల్ గేట్‌వేలో విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 79.74శాతం ఉత్తీర్ణత సాధించగా హైదరాబాద్‌కు చెందిన వి మోహన్ అభ్యాస్ 153.935 మార్కులతో ప్రథమర్యాంక్ సాధించాడు. అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 85.28 శాతం ఉత్తీర్ణత సాధించగా గుంటూరుకు చెందిన వి వెంకట అనిరుధ్ 150.567మార్కులతో మొదటి ర్యాంక్ దక్కించుకున్నాడు. ఇంజనీరింగ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ నుండి 1,79,569 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 1,70,128 మంది విద్యార్థులు పరీక్షకు హజరయ్యారు. వీరిలో 1,23,974 మంది అర్హత సాధించారు. తెలంగాణ నుండి 18,598 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 17,356 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 15,216 మంది విద్యార్థులు అర్హత సాధించారు. మొత్తంగా 79.74 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించగా వారిలో బాలుర 81,734 మంది, బాలికలు 57,451 మంది, ట్రాన్స్‌జెండర్స్ ఐదుగురు అర్హత సాధించారు. అలాగే అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ నుండి 65,675 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 55,289 మంది విద్యార్థులు అర్హత సాధించారు. తెలంగాణ నుండి 9,814 మంది విద్యార్థులు హాజరుకాగా 9,419 మంది విద్యార్థులు అర్హత సాధించారు. మొత్తంగా 85.28 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించగా వారిలో బాలురు 21,885 మంది, బాలికలు 42,489 మంది, ట్రాన్స్‌జెండర్స్ ఐదుగురు అర్హత సాధించారు.
12నుండి ర్యాంకు కార్డుల డౌన్‌లోడ్
ర్యాంకు కార్డులను మే 12వతేదీ నుండి వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలని, జూన్ 19వ తేదీ నుండి తరగతులు ప్రారంభించాలని నిర్ణయించినట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. రాష్టవ్య్రాప్తంగా 17 ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయని వాటిలో 3,924 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. 305 ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు ఉండగా 1,53,150 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. కౌన్సిలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ర్యాంకులను విద్యార్థుల మొబైల్‌ఫోన్లకు పంపిచనున్నట్లు పేర్కొన్నారు. వెబ్‌సైట్, ఇమెయిల్ ఐడిలకు అన్సర్ షీట్‌లను పంపిస్తామన్నారు. వేసవిలో తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కొన్ని కళాశాలల్లో తరగతులు నిర్వహిస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. ప్రభుత్వానికి ఎవరైనా ఒక్కటే అని ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు.
టాప్ ర్యాంకర్లు వీరే
ఇంజనీరింగ్
1 వి మోహన్ అభ్యాస్ (హైదరాబాద్)
2 ఎ సాయి ఎస్‌ఎస్‌వి భరద్వాజ్ (కొత్తగూడెం)
3 ఆర్ సత్యం (తమిళనాడు)
4 జి జయంత్ హర్ష (గుంటూరు)
5 సాయి వౌనిక్ (రంగారెడ్డి)
6 కె వెంకట్ నిఖిల్ (మేడ్చల్)
7 పి శశినాథన్ (పశ్చిమగోదావరి)
8 ఎంవి సాయి యశ్వంత్ (పశ్చిమగోదావరి)
9 డి వరుణ్‌తేజ (రంగారెడ్డి)
10 కె చిన్మయి సాయి నాగేంద్ర (పశ్చిమగోదావరి)

అగ్రికల్చర్, మెడికల్
1 వి వెంకట అనిరుధ్ (గుంటూరు)
2 డి సందీప్ (విశాఖపట్నం)
3 ఎన్ హిమజ (తూర్పుగోదావరి)
4 ఎస్ నిఖిల్ చౌదరి (హైదరాబాద్)
5 బి ఫణి శ్రీలాస్య (నెల్లూరు)
6 జి మనోజ్ పవన్ రెడ్డి (అనంతపూర్)
7 ఎన్ సాత్వికరెడ్డి (తూర్పుగోదావరి)
8 బి కళ్యాణ్ (కరీంనగర్)
9 పి సాయి శే్వత (విశాఖపట్నం)
10 పి అఖిల (సంగారెడ్డి)