క్రైమ్/లీగల్

స్నాచింగ్‌లో డబుల్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* అరవైకిపైగా నాన్‌బెయిలబుల్ వారెంట్లు
గచ్చిబౌలి, ఏప్రిల్ 23: నలుగురు సభ్యుల కరుగట్టిన దొంగల ముఠాను శంషాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలో ప్రధాన నిందితులు ఇప్పటి వరకు 210కిపైగా దొంగతనాలు చేసి మూడు కమిషనరేట్ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. వీరిపై 60 నాన్ బెయిల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. బెయిల్‌పై వచ్చిన నిందితులు రెండు సంవత్సరాలుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతూ 32 స్నాచింగ్‌లు, నాలుగు దొంగతనాలు చేశారు.
ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని కత్తితో బెదిరించి బంగారాన్ని దొచుకునిపోతున్న కరుడు గట్టిన నలుగురు సభ్యులున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 800 గ్రాములు బంగారు ఆభరణాలు, మూడు మోటార్ సైకిళ్లు, సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకొవడంతో పాటు దొంగ సొత్తును కొనుగోలు చేసిన రిసీవర్‌ని కూడా అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. మలక్‌పేటకు చెందిన ఎస్‌కే సలీమ్(28), నాచారంలో నివాసముండే సయ్యద్ నజీమ్ ఆప్రొజ్(27), ఫలక్‌నుమాలోని ఫాతిమనగర్‌లో నివాసముండే మహ్మద్ సలావుద్దీన్ ఖలీల్(52), మైలార్‌దేవుపల్లికి చెందిన సయ్యద్ జహంగీర్(24) ముఠాగా ఏర్పడి నగరంలోని మూడు కమిషనరేట్‌ల పరిధిలో స్నాచింగ్‌లు, దొంగతనాలు చేస్తూ పోలీసులకు కొరకరాని కొయ్యలుగా మారారు. 2016లో హైదరాబాద్ కమిషనరేట్‌లోని వివిధ పోలీసుస్టేషన్‌ల పరిధిలో 180 చైన్ స్నాచింగ్‌లు చేసి జైలుకు వెళ్లారు.
చిక్కడపల్లి పోలీసుస్టేషన్‌లో వీరిపై పీడీ యాక్ట్ పెట్టారు. చాలారోజులు జైలు జీవితం గడిపిన వీరు రెండు సంవత్సరాల క్రితం బెయిల్‌పై బయటకు వచ్చారు. వచ్చినప్పటి నుంచి పోలీసులకు కనబడకుండా తిరుగుతూ సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్‌ల పరిధిలో 32 చైన్ స్నాచింగ్‌లు, నాలుగు ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడినట్లు సీపీ తెలిపారు. గత నెలలో శంషాబాద్‌లో వృద్ధ దంపతులు మోటార్ సైకిల్‌పై వెళ్తుంటే వెంబడించి కత్తితో బెదిరించి మహిళ మెడలో నుంచి బంగారు ఆభరణాలు దోచుకుని పారిపోయారు. ఈసంఘటనలో కొన్ని ఆధారాలు పోలీసులకు దొరికాయి. వీటి ఆధారంగా దర్యాప్తు చేసి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా మూడు కమిషనరేట్‌ల పరిధిలో 32 స్నాచింగ్‌లు నాలుగు ఇళ్లలో దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారని సీపీ తెలిపారు. ఉదయం, సాయంత్ర ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని స్నాచింగ్‌లకు పాల్పడుతునట్లు సజ్జనార్ చెప్పారు. ప్రజలు ఎక్కువగా తిరగని శివారు ప్రాంతాలలో ఎక్కువ నేరాలు చేస్తారని అక్కడైతే పారిపోవడానికి అనువుగా ఉంటుందని తెలిపారు. వీరిపై మూడు కమిషనరేట్‌ల పరిధిలో 60 ఎన్‌బీడబ్ల్యూ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నట్లు సజ్జనార్ చెప్పారు. నిందితులు దొంగిలించిన సొమ్మును కొన్న రిసీవర్ ఆముల్ కోలీకర్‌ను కూడా అరెస్టు చేసామని చెప్పారు. దొంగ సొత్తును కొన్న వారిపైనా కేసులు పెడతామని హెచ్చరించారు. నిందితుల నుంచి 800 గ్రాముల బంగారు ఆభరణాలు, మూడు మోటార్ సైకిళ్లు, నాలుగు సెల్‌ఫోన్‌లు, ఒక కత్తి స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు. నిందితులను పట్టుకున్న సీసీఎస్ పోలీసులను అభినందించారు. కార్యక్రమంలో క్రైం డీసీపీ జానకీ షర్మిల, ఏసీపీ నంద్యాల నర్సింహా రెడ్డి, సీఐ చంద్రబాబు పాల్గొన్నారు.

బర్త్‌డే ఫంక్షన్‌లో ఘర్షణ
*యువకుడికి కత్తిపోట్లు
ఉప్పల్, ఏప్రిల్ 23: ఆదివారం రాత్రి జరిగిన ఫంక్షన్ ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఇరువురి మధ్య మాటా మాటా పెరిగింది. బయటకు వచ్చిన ఇరువర్గాలు అంతటితో ఆగకుండా పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని ఒక వర్గంలోని యువకుడిపై కత్తితో పొడిచాడు. ఈ సంఘటన ఉప్పల్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఆదివారం రాత్రి నాగోల్ రోడ్డులో గల ఫంక్షన్ హాల్‌లో ఓ యువకుడి బర్త్‌డే ఫంక్షన్ జరిగింది. కార్యక్రమానికి హాజరైన ఇరు వర్గాల యువకులు మాటా మాటా పెంచుకున్నారు. అంతటితో ఆగకుండా అక్కడి నుంచి ప్రధాన రహదారిలోని ఏసియన్ థియేటర్ పక్కన పెట్రోల్ బంక్ వద్దకు వచ్చారు. తార్నాక, లాలాపేట్ నుంచి వచ్చిన సంతోష్, కిషోర్ సతీష్‌రెడ్డిని పిలిపించి కత్తితో పొడిచి పరారయ్యారు. కల్యాణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అనంతచారి తెలిపారు
.
హత్య కేసు..నిందితుల ఇళ్లు దగ్ధం
ధారూర్, ఏప్రిల్ 23: టీఆర్‌ఎస్ నాయకుడు శ్రీనివాస్‌ను హత్య కేసు నింతుల ఇళ్లను గుర్తుతెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం మైలారంలో జరిగిన హత్యతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం హత్యకు గురైన శ్రీనివాస్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. హత్యకు పాల్పడిన ఐదుగురి ఇళ్లను దగ్ధం చేశారు. పోలీసులకు సమాచారం రావడంతో అగ్నిమాపక సిబ్బందిని పిలిపించి మంటలను ఆర్పివేశారు. సంఘటనా స్థలాన్ని ఎస్పీ అన్నపూర్ణ, వికారాబాద్ డిఎస్పీ శిరీష, సీఐ ఉపేందర్ పరిశీలించారు. గ్రామంలో 144 సెక్షన్‌ను విధించారు. గ్రామంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామాన్ని వికారాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ అరుణ, ఆర్డీవో విశ్వనాథం సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.