క్రైమ్/లీగల్

బస్సు కింద పడి బాలుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, మే 14: ఇంజనీరింగ్ కళాశాల బస్సు చక్రాల క్రింద పడి బాలుడు మృతి చెందిన సంఘటన అహ్మద్‌గూడ గ్రామంలో చోటు చేసుకుంది. స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం అహ్మద్‌గూడ గ్రామానికి చెందిన సంగని ఆనంద్‌బాబు, జయ కుమారుడైన లక్ష్మీదీపక్ (7) ఒకటవ తరగతి చదువుతున్నాడు. సోమవారం సాయత్రం నాలుగు గంటల సమయంలో కిరాణ దుకాణంలో చాక్లెట్స్ కొనుక్కుని, తిరిగి రోడ్డు దాటుతుండగా చీర్యాల్ గ్రామానికి చెందిన గీతాంజలి ఇంజనీరింగ్ కళాశాల బస్సు బాలుడిని ఢీకొన్నది. ఈ దుర్ఘటనలో బాలుడి తలపై నుంచి బస్సు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడే ఉన్న స్ధానికులు బస్సును ఆపి బస్సు డ్రైవర్‌పై దాడి చేయడంతో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు అక్కడికి చేరుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కళాశాల యాజమాన్యం ఘటనా స్ధలానికి రావాలని గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. గ్రామ పెద్ధలు కళాశాల యాజమాన్యంతో మాట్లాడి మృతుని తల్లిదండ్రులకు పదిహేను లక్షలు నష్టపరిహారం ఇచ్చేలా మాట్లాడడంతో గ్రామస్తులు ధర్నా విరమించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

బాలికపై అత్యాచార యత్నం
హైదరాబాద్, మే 14: మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేసిన కేసులో చాదర్‌ఘట్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. చాదర్‌ఘట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల కిందట జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాతమలక్‌పేటకు చెందిన ఇస్మాయిల్ అనే వ్యక్తి తన స్నేహితుడి ఆరేళ్ల కుమార్తెపై అత్యాచార యత్నం చేయబోయాడు. ఇది గమనించిన స్ధానికులు దేహశుద్ది చేసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న చార్‌ఘట్ పోలీసులు, సుల్తాన్‌బజార్ ఏసీపీ చేతన సంఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి బాధితురాలితోనూ, తల్లిదండ్రులతో మాట్లాడారు. అనంతరం ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించి అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.