క్రైమ్/లీగల్

ఆర్‌బీఐ క్వార్టర్స్ వద్ద సైకో వీరంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనత్‌నగర్, మార్చి 13: సంజీవరెడ్డినగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆర్‌బీఐ క్వార్టర్స్ వద్ద బుధవారం ఓ సైకో వీరంగం సృష్టించాడు. బీరు సీసా చేతపట్టుకొని అటుగా వెళుతున్న వారిపై దాడికి యత్నించాడు. నడుచుకుంటూ వెళుతున్న ఓ వృద్ధుడి వెంటపడి భయబ్రాంతులకు గురిచేశాడు. దీంతో స్థానికులు అతన్ని పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతన్ని అదుపులోనికి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం తల్లిదండ్రులకు పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. మతిస్థిమితం లేకపోవడంతోనే ఇలా చేస్తున్నాడని చెప్పడంతో అతన్ని పంపించి వేశారు.