రాష్ట్రీయం

ఇక సమగ్ర సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: తెలంగాణలో రాష్ట్రప్రజల సమగ్ర వివరాలను సేకరించిన తీరులోనే రాష్ట్రంలోనూ సమగ్ర సర్వే నిర్వహించి ప్రతి కుటుంబం వివరాలు తెలుసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. రానున్న రోజుల్లో వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించడంతోపాటు త్వరలోనే ముస్లిం రిజర్వేషన్లపైనా కమిటీని నియమించి తగిన నిర్ణయం తీసుకోవాలనే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి సామాజిక వర్గం ఆర్ధిక స్థితిగతులు, జీవన ప్రమాణాలపై సర్వే చేపట్టి దానికి అనుగుణంగానే రానున్న రోజుల్లో పేదరిక నిర్మూలన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. దామాషా పద్ధతిలో ప్రతి సామాజికవర్గం ప్రభుత్వ ప్రయోజనాలు పొందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది.
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అధిక సంఖ్యాకులుగా వాల్మీకి బోయ కులస్థులను ఎస్టీలుగా గుర్తించే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకునేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను సిఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రస్తుతం బిసి-ఎలో ఉన్న తమను ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ వాల్మీకి కుటుంబాలకు చెందినవారు కోరుతున్న విషయాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు సిఎం దృష్టికి తెచ్చారు. యుపి, కేరళ, హర్యానా తదితర రాష్ట్రాల్లో వాల్మీకులను బోయగా (ఎస్సీ)గా గుర్తించారు. అయితే ఆంధ్రలో మాత్రం వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలని ఎన్టీఆర్ సిఎంగా ఉన్నప్పుడే ఆ ప్రక్రియ ప్రారంభించారు. కర్నాటకలో హవనూర్ కమిషన్ వేసి 1991లో ఆర్డినెన్స్ ద్వారా వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించారు. రాజ్యాంగ, న్యాయ నిపుణులతో కూడా చర్చించి ఎస్టీలుగా గుర్తించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సిఎం అధికారులకు సూచించారు. కులాలు, మతాలు, ప్రాంతాల పేరిట ఆందోళనలు జరిగితే రాష్ట్భ్రావృద్ధి నిలిచిపోయే ప్రమాదం ఉందని, పెట్టుబడులు పెట్టేవారు కూడా ఎవరూ ముందుకు రారనే భయాన్ని ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. కులం, మతం, ప్రాంతం పేరిట ఉద్యమాలు చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రానున్న రోజుల్లో ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై ఒక నిర్ణయం తీసుకునేందుకు కూడా కమిటీ వేయనున్నారు.