రాష్ట్రీయం

ఐదోస్థానంలో విశాఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా నెలకొల్పిన స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో విశాఖకు ఐదోస్థానం దక్కింది. విశాఖ సహా మొత్తం పది నగరాలకు కేంద్రం అవార్డులు ప్రకటించింది. పరిశుభ్రతలో విశాఖపట్నం నగరం దేశంలోనే ఐదోస్థానం దక్కించుకున్నది. పరిశుభ్ర నగరాల ఎంపికలో మైసూర్‌కు మొదటి ర్యాంకు లభించగా, చండీగఢ్ ద్వితీయ, తిరుచిరాపల్లికి తృతీయ, న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్‌కు నాలుగో ర్యాంకు దక్కించుకున్నాయి. విశాఖపట్నానికి ఐదో ర్యాంకు లభిస్తే, సూరత్, రాజ్‌కోట్, పంప్రి చించ్వాడ్, గ్రేటర్ ముంబయిలు వరుసగా ఆరు నుంచి పది ర్యాంకులు సాధించాయి. మొదటి పది పరిశుభ్ర నగరాల జాబితాలో చేరేందుకు హైదరాబాద్, విజయవాడ, వరంగల్ దూసుకొస్తున్నట్టు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు సోమవారం మీడియా సమావేశంలో ప్రకటించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ దేశంలోని 73 నగరాల్లో నిర్వహించిన స్వచ్ఛత సర్వే ఆధారంగా నగరాలకు ర్యాంకులు కల్పించినట్టు వెంకయ్యనాయుడు వివరించారు. 2019నాటికి స్వచ్ఛ భారత్ సాధన నరేంద్ర మోదీ లక్ష్యమన్నది తెలిసిందే. పరిశుభ్రతలో ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి సహా కల్యాణ్, దొంబివిల్లి, జంషెడ్‌పూర్, ఝజియాబాద్, రాయపూర్, మేరర్, పాట్నా, ఇటానగర్, అసన్సోల్, ధన్‌బాద్ అట్టడుగున్న ఉండటం గమనార్హం. పరిశుభ్ర నగరాల జాబితాలో చేరేందకు దేశంలోని వివిధ నగరాల మధ్య పోటీ తీవ్రరూపం దాలుస్తోందని, ఈ పరిణామం తనకెంతో సంతోషం కలిగిస్తోందని వెంకయ్య చెప్పారు. పరిశుభ్రత కోసం నగరాలు, పట్టణాల మధ్య పోటీ ఎంత పెరిగితే దేశానికి అంత మంచిదని అభిప్రాయపడ్డారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఏటా పరిశుభ్ర నగరాలకు అవార్డులు ఇస్తామని వెంకయ్య ప్రకటించారు. దేశంలోని మొదటి పది పరిశుభ్ర నగరాలకు వెంకయ్య మీడియా సమావేశంలోనే అవార్డులు బహూకరించటం గమనార్హం. పరిశుభ్రతలో మొదటి పది స్థానాలు దక్కించుకున్న పది నగరాల మేయర్లు, కమిషనర్లు అవార్డులను అందుకున్నారు. విశాఖపట్టణానికి ప్రణాలిక, కమ్యూనికేషన్, చెత్తను సద్వినియోగం చేయటం, పరిశుభ్రతరంగాల్లోనూ అవార్డు లభించింది. విశాఖకు లభించిన రెండు అవార్డులను విశాఖ మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, సీనియర్ అధికారి వీణా ఇష్‌లు వెంకయ్య చేతుల మీదుగా అందుకున్నారు. దేశంలోని పరిశుభ్ర నగరాల ఎంపికకు వైజ్ఞానిక పద్ధతిని అవలంభించామని, సర్వే బృందాలు 73 నగరాల్లోని వివిధ ప్రాంతాలను సందర్శించి మార్కులు వేసాయని వెంకయ్య వివరించారు. ఈ మార్కుల ఆధారంగానే ఆయా నగరాలకు ర్యాంకులు కల్పించినట్టు చెప్పారు. హైదరాబాద్, విజయవాడ, వరంగల్ సహా దేశంలోని ఇరవై నగరాలు మొదటి పది పరిశుభ్ర నగరాల స్థాయికి ఎదిగేందుకు గట్టిగా పోటీ పడుతున్నాయని, ఇది శుభ పరిణామమని వెంకయ్య పేర్కొన్నారు.