Others

కలుపుగోలుతనంతో కష్టాలు దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనిచేసే చోట రాణించాలంటే కష్టపడటం ఒక్కటే కాదు, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం కూడా తప్పనిసరి. ముఖ్యంగా కొందరు మహిళలకు ఇది చాలా అవసరం అంటారు నిపుణులు.
సమస్య ఎదురైనపుడు ఎక్కువమంది బాధపడితే.. చాలా తక్కువమందే పరిష్కారం కోసం ఆలోచిస్తారు. మీరు బాధపడేవారైతే.. ఆ ధోరణి మార్చుకొనే ప్రయత్నం చేయండి.
కొందరు బాధ కల్గినపుడు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనపుడు వౌనం వహిస్తారు. ఒంటరిగా గడుపుతారు. నిజానికి అలాంటి వేళలో అందరితో కలవాలి. సానుకూల దృక్పథం కలవారితో ఎక్కువగా మాట్లాడితే.. కచ్చితంగా మీలోనూ మార్పు కన్పిస్తుంది.
మనసుకు దగ్గరైనవారితో మనసు విప్పి మాట్లాడాలి. వారి సలహాలు మీకు ఉపయోగపడవచ్చు. మానసిక సందిగ్ధత అనేది దూరమవుతుంది. వీటితోపాటు యోగా, ధ్యానం వంటివి ఉద్వేగాలను అదుపులో ఉంచడానికి తోడ్పడుతాయి. ఒత్తిడి కూడా తగ్గుతుంది. కోపం వున్నా అదుపులోకి వచ్చేస్తుంది.
ఇంకా చెప్పాలంటే మనసుకు నచ్చిన సంగీతం వింటే మనసుకెంతో ఉల్లాసంగా ఉంటుంది. ఇష్టమైన పుస్తకం చదివితే మసు మంచి మార్గాన పయనిస్తుంది. ఇష్టమైన వ్యక్తితో అత్యంత సుందర సుదూర తీరాలకు వెళితే.. మన మనసుకు ఎంతో ఉత్సాహం రావడం మాత్రం ఖాయం.
ఈ ప్రపంచంలో ఎవరూ ఒంటరివారు కారు. ఒంటరితనం వద్దు. ఏదో ఒక తోడు ఎంతో ముద్దు. ఒంటరితనం వదలండి.. ఉల్లాసంగా.. ఉత్సాహంగా నూరేళ్ళు హాయిగా.. సంతోషంగా జీవించండి.

- కురువ శ్రీనివాసులు