సబ్ ఫీచర్

మరుగున పడుతున్న స్వదేశీ పరిజ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

'తాతలు నేతులు తాగారు- మా మూతులు వాసన చూడమంటే, పాచి కంపుకొడతాయి’. ప్రస్తుతం మన దేశంలోని కొందరు మేధావుల పరిస్థితి అదే విధంగా ఉంది. ఇందుకు కారణం పాలకపక్షాలే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రాచీన కాలంనుంచి భారతీయులు అద్భుతమైన మేధస్సును కలిగిఉన్నారు. విద్య, వైద్య, వైజ్ఞానిక, గణిత, జీవ, భౌతిక, రసాయన మొదలైన శాస్త్రాలలో భారతీయుల విజ్ఞానం అపారం. అయితే, దురదృష్టం ఏమిటంటే ప్రాచీన భారతదేశానికి సంబంధించిన విజ్ఞాన సంపద యావత్తు సంస్కృత భాషలో నిక్షిప్తమై ఉంది. భారతీయులు ఎప్పుడు ‘కొత్త ఒక వింత-పాత ఒక రోత’అన్న నానుడికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తారు. శతాబ్దాల తరబడి విదేశీయుల పాలనలో మగ్గిన భారతీయులు సంస్కృత భాషను నిర్లక్ష్యం చేశారు. భారతీయుల మనస్తత్వాన్ని చక్కగా అంచనావేసిన బ్రిటిష్‌వారు, తమ పరిపాలనా తమకు సహాయకులను తయారుచేసుకోవడానికి ఆంగ్లభాషను ప్రవేశపెట్టారు. అదే సమయంలో తమ దేశానికి చెందిన చరిత్రకారుల చేత భారతదేశ చరిత్రను వ్రాయించారు. దీంతో భారతదేశ చరిత్రకు చెదలు పట్టడం ప్రారంభంఅయింది. అదే సమయంలో వైజ్ఞానిక సంపద భాండాగారంగా ఉన్న సంస్కృతాన్ని భారతీయులు నిర్లక్ష్యంచేసే విధంగా అటు ఇంగ్లీషుభాషను ప్రవేశపెట్టడంతోపాటు, సంస్కృతం హిందూ మతానికి సంబంధించినది అనే భావనను ప్రజలలో కల్పించడంలో బ్రిటిష్‌వారు సఫలీకృతులయ్యారు.
సంస్కృత భాషను నిర్లక్ష్యం చేయడంతోపాటు, అందులో ఉన్న వైజ్ఞానిక అంశాలను కూడ విస్మరించాము. దీంతో పాశ్చాత్యులే మేధావులనే భావనను బ్రిటిష్‌వారు భారతీయుల మెదళ్ళలో జొప్పించడంలో విజయం సాధించారు. ఆవిధంగా భారతీయ వైజ్ఞానిక సంపద బయట ప్రపంచానికి తెలియకుండా బ్రిటిష్‌వారు చేయగలిగారు. పాశ్చాత్య దేశాలవారికి భారతీయులంటే మొదటినుంచి చులకన భావమే. మొక్కలకు కూడ ప్రాణం ఉందని, అవి కూడ స్పందిస్తాయని శాస్ర్తియంగా నిరూపించిన సర్ జగదీష్ చంద్రబోస్ నుంచి అహింస ద్వారా సాధించలేనిది ఏమిలేదని నిరూపించిన మహాత్మాగాంధీ వరకు ఎందరికో నోబెల్ బహుమతి అందుకొనే అర్హతలు ఉన్నప్పటికీ వారికి దక్కలేదు.
ఇటీవల వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతిని ముగ్గురికి ప్రకటించారు. వారిలో చైనాకు చెందిన యుయుతు ఒకరు. ఆమె మలేరియా మహమ్మారిని పారద్రోలడానికి వినియోగిస్తున్న ఆర్టెమైసినిన్‌ను కనుగొన్నందుకు ఇచ్చారు. ఆర్టెమైసినిన్ మలేరియా పరాన్నజీవి ప్లాస్మో డియంను నిలువరిస్తుంది. అయితే, ఆర్టెమైసినిన్‌ను భారతీయులు ఎప్పుడో కనుగొన్నారని సి.సి.ఎం.బి.కి చెందిన సీనియర్ శాస్తవ్రేత్త డాక్టర్ సునీల్‌కుమార్‌వర్మ చెబుతున్నారు. ఇది కాదనలేని నిజం. డాక్టర్ సునీల్‌కుమార్‌వర్మ ప్రతిష్టాత్మకమైన ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయంనుంచి డాక్టరేటు పొందారు. 1918లో ‘ఇండియన్ మెడిసినల్ ప్లాంట్స్’ పేరిట డాక్టర్ కె.ఆర్.కీర్తికార్, బి.బి.బసులు వెలువరించిన పుస్తకంలో ఆర్టెమైసినిన్‌ను మొక్కలనుంచి సంగ్రహించవచ్చని, దాని ద్వారా మలేరియాను నివారించవచ్చునన్న విషయం ఈ పుస్తకంలో ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేస్తున్నారు. భారతీయులకు అంతర్జాతీయ స్థాయిలో అన్యాయం జరగడం ఇదే ప్రథమంకాదు. గతంలో అనేకసార్లు జరిగింది. భవిష్యత్‌లో కూడ జరుగుతుంది. అందులో ఏమి అనుమానం లేదు.
క్రీ.పూ. ఆరవ శతాబ్దంలోనే శుశ్రుతుడు వైద్యరంగంలో పలు అద్భుతాలను సృష్టించారు. ఆయుర్వేద వైద్యానికి సంబంధించి ఆయన ఏడువందల ఔషధాల గుణగణాలను వివరిస్తూ, శుశ్రూత సంహిత పేరుతో ఒక బృహత్ గ్రంథాన్ని రచించారు. సదరు గ్రంథంలోని అంశాలకు శాస్ర్తియ నిరూపణలు చేయాల్సిన బాధ్యత మన శాస్తవ్రేత్తలపై ఉంది. వారిని ఆ దిశగా ప్రోత్సహించాల్సింది పాలక పక్షాలు. శాస్తవ్రేత్తలను ప్రోత్సహించి, స్వదేశీ విజానానికి శాస్ర్తియతను జోడిస్తే, ప్రజలకు కారుచౌకగా వైద్యం అందచేయవచ్చు. అయితే, ఆ విధంగాచేస్తే సాలీనా వేల కోట్ల రూపాయలు లాభాలు గడిస్తున్న కార్పొరేట్ మందుల తయారీ కంపెనీలకు లాభాలు తగ్గిపోతాయి. అదే జరిగితే, కార్పొరేట్ కంపెనీలనుంచి రాజకీయ పార్టీలకు వచ్చే నిధుల రూపంలో వచ్చే ముడుపులు నిలిచిపోతాయి. అందువల్లనే పాలకపక్షాలు స్వదేశీ పరిజ్ఞానం అభివృద్ధికన్నా వివిధ పేర్లతో కార్పొరేట్ కంపెనీలకు రెడ్ కార్పెట్ పరవడానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. అందువలన, మబ్బులుకమ్మిన చంద్రుడి మాదిరిగా స్వదేశీ పరిజ్ఞానం మరుగునపడిపోతున్నది. మరుగున పడిన పరిజ్ఞానంకు శాస్ర్తియతను జతపరిస్తే భవిష్యత్‌లో విద్య, వైద్య, వైజ్ఞానిక రంగాలలో భారతదేశందే అగ్రస్థానం అవుతుంది.

- పి.మస్తాన్‌రావు