రాష్ట్రీయం

భవానీలతో పోటెత్తిన ఇంద్రకీలాద్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ , జనవరి 2: అమ్మవారి దీక్షల విరమణకు భవానీలకు కేవలం రెండురోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో శనివారం సాయంత్రం ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి పెద్దసంఖ్యలో భవానీలు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. ఉదయం భవానీల సంఖ్య స్వల్పంగా ఉన్నప్పటికీ సాయంత్రం 5గంటల నుండి వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది రాక ప్రారంభమైంది. రాత్రి 10.30 గంటల సమయానికి విపరీతమైన రద్దీ ఏర్పడింది. భవానీలు తొలుత పవిత్ర కృష్ణానదిలో స్నానాలు ఆచరించారు. గురుభవానీల ఆధ్వర్యంలో ఇరుముడులకు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఇరుముడులను శిరస్సుపై ధరించి జై.. దుర్గ్భావానీ జై.. అంటూ సుమారు 8కిలోమీటర్ల గిరిప్రదక్షిణ చేశారు. ఈసందర్భంగా ప్రతి సెంటర్‌లో వివిధ సేవా సంస్థల నిర్వాహకులు భవానీలు, వారితో ఉన్న కుటుంబ సభ్యులకు అల్పహారం అందజేశారు. ఇంద్రకీలాద్రి చుట్టూ ప్రతి సెంటర్‌లో స్థానికులు వివిధ రకాలైన సెట్టింగ్‌లతో శ్రీ కనకదుర్గమ్మ ప్రతిమలను ఏర్పాటు చేశారు. ‘కాపాడమ్మా.. రక్షించమ్మా.. నీవే రక్షణ.. నీవే దిక్కు’.. అని దుర్గమ్మను కీర్తిస్తూ భవానీలు గిరిప్రదక్షిణ పూర్తిచేసి అమ్మవారిని దర్శించుకున్నారు. హోమగుండంలో పూజాసామగ్రి సమర్పించి గురుభవానీల ఆధ్వర్యంలో మెడలోని దీక్షమాలను తీయించుకున్నారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇవో సిహెచ్ నరసింగరావు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి అక్కడి సిబ్బంది తగిన ఆదేశాలు జారీ చేశారు. సహాయ ఇవో శ్రవణం అచ్యుతరామయ్య నాయుడు, బి వెంకటరెడ్డి, పర్యవేక్షణాధికారులు కె శ్రీనివాసమూర్తి, ఎం రమేష్, తదితరులు పాల్గొన్నారు.