సబ్ ఫీచర్

ప్రభావశీల మహిళల్లో భారత్ నుంచి ఏడుగురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావశీలురైన మహిళలకు సంబంధించి వంద మంది పేర్లతో రూపొందించిన జాబితాలో భారత్ నించి ఏడుగురికి స్థానం లభించింది. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వందమంది మహిళల్ని ఎంపిక చేసి, ప్రఖ్యాత మీడియా సంస్థ ‘బిబిసి’ ఏటా ఓ జాబితాను ప్రకటిస్తుంది. ఈ ఏడాదికి సంబంధించి ‘వంద మంది ప్రభావశీల మహిళ’ల్లో మన దేశానికి చెందిన ప్రఖ్యాత గాయని ఆశాభోంస్లే, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, నటి కామినీ కౌశల్, మహిళా రైతు రింపీ కుమారి, ప్రచారకర్త ముంతాజ్ షేక్, పారిశ్రామిక రంగంలో కృషి చేస్తున్న స్మృతి నాగ్‌పాల్, కణికా టెక్రీవాల్‌కు చోటు దక్కింది. రాజకీయాలు, కళలు, సామాజిక సేవ, సైన్స్, ఉత్పాదక రంగం వంటి పలు విభాగాల్లో స్ఫూర్తిదాతలుగా నిలిచి తమదైన ముద్ర వేసుకున్న మహిళలను బిబిసి ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఎంపికైన వందమంది ప్రభావశీల మహిళలు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే సంబంధిత రంగాల్లో ఎంతో ప్రసిద్ధి చెందారు. బాలీవుడ్‌లో 1943లో గాయనిగా రంగప్రవేశం చేసిన ఆశాభోంస్లే రికార్డు స్థాయిలో వివిధ భాషల్లో వెయ్యికిపైగా సినిమాల్లో తన గాత్ర మాధుర్యం పంచారు. ఎన్నో సినిమాల్లో తన అత్యుత్తమ నటనతో ప్రేక్షకులను అలరించిన అలనాటి నటి కామిని కౌశల్‌ను ప్రభావశీలి మహిళగా బిబిసి గుర్తించింది. ఆమె నటించిన ‘నీచానగర్’ 1946లో కేన్స్‌లో ఫిల్మ్ ఫెస్టివల్‌లో మేటి సినిమాగా ఎంపికైంది. ఇక, హైదరాబాద్‌కు చెందిన టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఎన్నో పతకాలను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్‌కు చెందిన రింపీ కుమారి మహిళా రైతుగా ఘన చరిత్రను సృష్టించారు. 32 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో వినూత్న పద్ధతుల్లో పంటలను సాగుచేసి రైతులందరికీ ఆమె స్ఫూర్తిగా నిలిచారు. ముంబయిలో మహిళల కోసం పెద్ద సంఖ్యలో మూత్రశాలలు నిర్మించి, ‘పచ్చదనం - పరిశుభ్రత’ నినాదానికి ప్రచారకర్తగా వ్యవహరించిన ముంతాజ్ షేక్ కూడా స్ఫూర్తిప్రదాతగా నిలిచారు. స్మృతినాగ్‌పాల్, కణిక టెక్రీవాల్ పారిశ్రామిక రంగంలో అద్వితీయ ప్రతిభ చూపి తమదైన ముద్ర వేసుకున్నారు. * (చిత్రం) ఆశాభోంస్ల్లే