అంతర్జాతీయం

క్రిస్మస్ రోజున అరుదైన పున్నమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, డిసెంబర్ 18: ఈ క్రిస్మస్ రోజున ఆకాశంలో అత్యంత అరుదైన పున్నమిచంద్రుడు కనువిందు చేయబోతున్నాడు. 1977 తర్వాత ఇప్పటివరకు ఇలాంటి పున్నమి సంభవించలేదని, మళ్లీ 2034 వరకు ఇలాంటిది చూడబోమని అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా తెలిపింది. ఈ ఏడాదిలో చివరి పున్నమి అయిన దీన్ని ‘్ఫల్ కోల్డ్ మూన్‌గా’ కూడా వ్యవహరిస్తారు. ఎందుకంటే ఇది శీతాకాలం ప్రారంభంలో రావడమే దీనికి కారణం. ‘ఇలాంటి అరుదైన సంఘటన మళ్లీ 2034 దాకా సంభవించదు. అది చాలా సుదీర్ఘమైన వేచి ఉండే సమయం. అందువల్ల క్రిస్మస్ రోజున నింగిలో సంభవించే ఈ అద్భుతాన్ని తప్పకుండా వీక్షించండి’ అని నాసా ఒక ప్రకటనలో తెలిపింది. నాసాకు చెందిన లూనార్ రికన్నైస్సన్స్ ఆర్బిటర్ (ఎల్‌ఆర్‌ఓ) 2009నుంచి చంద్రుడి ఉపరితలాన్ని పరిశీలిస్తోంది.‘ఇలాంటి సందర్భంలో మనం చంద్రుడ్ని చూసినట్లయితే అది కేవలం మన పొరుగున ఉన్న ఒక ఉపగ్రహం మాత్రమే కాదనే విషయం మనకు గుర్తుకు వస్తుంది’ అని మేరీలాండ్‌లోని నాసాకు చెందిన గోడ్డార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌కు చెందిన జాన్‌కెల్లర్ అభిప్రాయ పడ్డారు. చంద్రుడు, భూమికి సంబంధించిన భౌగోళిక చరిత్ర ఎంత దగ్గరగా కలిసిపోయి ఉన్నాయంటే చంద్రుడు లేకపోతే భూమి ఒక భిన్నమైన గోళంగా ఉండేదేమోననిపిస్తుందని కూడా ఆయన అన్నారు.