అంతర్జాతీయం

చేతులు కలపండి.. ఉగ్రవాదాన్ని మట్టుబెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరాస, నవంబర్ 29: ఉగ్రవాదం నుంచి ఎదురవుతున్న ముప్పును భారత్, పాకిస్తాన్ సమర్థవంతంగా తిప్పికొట్టాలంటే ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడి సానుకూల వాతావరణం ఏర్పడాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ స్పష్టం చేశారు. విభేదాలను పరిష్కరించుకునేందుకు ఇరు దేశాలు చర్చలు జరపడమే ఏకైక మార్గమని ఆయన ఉద్ఘాటించారు. ‘్భరత్, పాకిస్తాన్ మధ్య సంబంధాల మెరుగుదలకు చర్చలే ఏకైక మార్గమని నేను గట్టిగా విశ్వసిస్తున్నా. అందుకే చర్చల ద్వారా అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలని ఇరు దేశాల నాయకులకు విజ్ఞప్తి చేశా. అవసరమైతే ఈ విషయంలో నా వంతు సహకారాన్ని కూడా అందజేస్తానని వారికి స్పష్టం చేశా’ అని మూన్ పిటిఐతో అన్నారు. ఎన్ని విభేదాలున్నప్పటికీ ఇరు దేశాలు సంయమనంతో వ్యవహరించాలని ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేశానని తెలిపారు. ఉగ్రవాదం వలన అంతర్జాతీయ శాంతి, భద్రతలకు పెనుముప్పు ఎదురవుతున్న విషయాన్ని బాన్ కీ మూన్ ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, భారత్, పాక్ మధ్య పరిస్థితులు మెరుగుపడితే ఉగ్రవాదం సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు దోహదపడుతుందన్నారు. పాక్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ ఇటీవల ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశ చర్చలో ప్రసంగిస్తూ, భారత్, పాక్ మధ్య చర్చల పునరుద్ధరణకు నాలుగు అంశాలతో కూడిన కార్యాచరణను ప్రతిపాదించగా, పాక్ ఉగ్రవాదాన్ని విడనాడితే సరిపోతుందని విదేశీ వ్యవహాలాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేసిన విషయం విదితమే.