అంతర్జాతీయం

వచ్చే వారం భారత్, చైనా భద్రతా సలహాదార్ల భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, అక్టోబర్ 29: భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదార్లు వచ్చే వారం సమావేశం కానున్నారు. అణు సరఫరాల గ్రూపు (ఎన్‌ఎస్‌జి)లో సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు, అలాగే పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్‌పై ఐక్యరాజ్య సమితి నిషేధం విధించకుండా చైనా అడ్డుపడుతుండటంతో ఇరు దేశాల మధ్య విభేదాలు తలెత్తి ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. దీంతో ద్వైపాక్షిక సంబంధాల స్థితిగతులపై, ప్రత్యేకించి ఇరు దేశాల మధ్య సంబంధాలకు ఇబ్బందికరంగా పరిణమించిన అంశాలపై చర్చించేందుకు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా జాతీయ భద్రతా సలహాదారు యాంగ్ జియెచీ నవంబర్ మొదటి వారంలో హైదరాబాద్‌లో సమావేశమవుతారని అధికారులు వివరించారు. ఎన్‌ఎస్‌జిలో భారత్‌కు సభ్యత్వం కల్పించకుండా అడ్డుపడుతున్న చైనా, మరోవైపు ఐక్యరాజ్య సమితిలో సాంకేతిక కారణాలను సాకుగా చూపి కరడు గట్టిన పాక్ ఉగ్రవాది మసూద్ అజార్‌పై ఐక్యరాజ్య సమితి నిషేధం విధించకుండా వరుసగా రెండోసారి చైనా మోకాలడ్డింది.