అంతర్జాతీయం

కూలిన సైనిక విమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బౌఫరిక్ (అల్జీరియా), ఏప్రిల్ 11: అల్జీరియాకు సైనిక విమానం బుధవారం కుప్పకూలిన దుర్ఘటనలో 257మంది దుర్మరణం చెందారు. వీరంతా సైనికులు, వారి కుటుంబాలేనని అధికార వర్గాలు తెలిపాయి. బౌఫరిక్ వైమానిక స్థావరం సమీపంలోని పొలంలో కూలిపోయిన విమాన భాగాలను ఒక ఫోటోగ్రాఫర్ గుర్తించాడు. అల్జీర్స్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రమాద స్థలానికి వందలాది అంబూలెన్స్‌లు వెళ్లాయి. ప్రమాదంలో 247 మంది సైనిక కుటుంబీకులు, 10 మంది సిబ్బంది మరణించినట్టు రక్షణ మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయ. కాగా ప్రమాదంపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అల్జీరియాలో ఇటీవల విమాన ప్రమాదాలు తరచూ సంభవిస్తున్నాయ. 2012 డిసెంబర్ అర్థరాత్రి సమయంలో రెండు సైనిక విమానాలు ఢీకొని రెండు విమానాల్లోని పైలెట్లు మరణించారు. 2014 ఫిబ్రవరి నెలలో సైనిక సిబ్బందిని తీసుకెళుతున్న సైనిక విమానం ఒకటి దక్షిణ అల్జీరియాలోని తమన్రాసెట్ వద్ద కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారంతా మరణించారు. సీ-130 హెర్క్యులిస్ విమానం కుప్పకూలిన సంఘటనలో ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పట్లో వాతావరణం సరిలేకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని అధికారవర్గాలు తెలిపాయి.