అంతర్జాతీయం

లింగాయత్‌లపై ప్రేమకాదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టిప్తూర్, మార్చి 26: కర్నాటకలో లింగాయత్‌లు, వీర లింగాయత్‌లకు ప్రత్యేక మై నారిటీ స్టేటస్ కల్పిస్తాన్న ముఖ్యమంత్రి సి ద్దరామయ్య ప్రకటనను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఎద్దేవా చేశారు. బీ ఎస్ యెడ్యూరప్పను సీఎం కాకుండా అడ్డుకునేందుకే సిద్దరామయ్య లింగాయత్‌లను తెరమీదకు తెచ్చారని షా ఆరోపించారు. ‘ముఖ్యమంత్రి సిద్దరామయ్య నిజంగా లింగాయత్‌లపై ప్రేమ ఉండికాదు. బీజేపీ గెలుపును అడ్డుకోవడం తద్వారా యెడ్యూరప్పను ముఖ్యమంత్రి కాకుండా చేయడం’ అని బీజేపీ చీఫ్ అన్నారు. ఇక్కడ ఏర్పాటైన కొబ్బరి రైతుల రెండు రోజుల సభలో సో మవారం అమిత్ షా మాట్లాడారు. వచ్చే ఎ న్నికల్లో బీజేపీ గెలిస్తే ఎడ్యూరప్పే మీ ము ఖ్యమంత్రి అని ప్రకటించారు. లింగాయత్ సామాజిక వర్గంలో బలమైన నాయకుడైన యెడ్యూరప్పను అడ్డుకోవాలనే సిద్దరామ య్య వ్యూహం. దీనిలో భాగంగానే వారి ప్ర త్యేక మైనారిటీ స్టేటస్ కల్పిస్తామని ఆయన ప్రకటించారు. అంతేకాదు ఇటీవల కేబినెట్ సమావేశంలో ఓ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు సిద్దరామయ్య. లింగాయత్‌లను ఆకట్టుకోవడం ద్వారా బీజేపీ విజయావకాశాలను దెబ్బతీయాలని కాంగ్రెస్ భావిస్తోం ది. ఇందులో భాగంగానే లింగాయత్, వీర లింగాయత్‌లకు ప్రత్యేక మైనారిటీ హోదా హామీ. ఇక సిద్దరామయ్య ఎత్తులు సాగవని అమిత్ షా అన్నారు. బ్రిటిష్ పాలకులు ‘విభజించు-పాలించు’ విధానాన్ని కర్నాటక సీఎం అనుసరిస్తున్నారని బీజేపీ చీఫ్ ఆరోపించారు. ‘కాంగ్రెస్ మునుగుతు న్న నౌక. ఎలాగైనా దాన్ని కాపాడుకోవాల నే ఉద్దేశంతో ఎత్తులు వేస్తోంది’ అంటూ విమర్శించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను నివారించడంతో సిద్దరామయ్య ప్ర భుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. 3,781 మంది రైతుల ఆత్మహత్యలకు ఎవ రు కారణమని ఆయన ప్రశ్నించారు. సిద్దరామయ్య అవినీతి ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి రూ.40లక్షల వాచ్ ఉదంతం చాలని ఆయన అన్నారు.