ఆంధ్రప్రదేశ్‌

నీటిపారుదలకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏపి బడ్జెట్‌లో రూ.16,491.81 కోట్లు కేటాయింపు * కేంద్రంపై దింపుడు కళ్లం ఆశలు
హైదరాబాద్, మార్చి 10: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధమిక రంగానికి భారీ నిధులను బడ్జెట్‌లో కేటాయించింది. వ్యవసాయ విభాగాలు, పాడిపరిశ్రమ, మత్స్యరంగం, జలవనరుల నిర్వహణ, అడవులు పర్యావరణం కలిపి 2016-17 బడ్జెట్‌లో 16,491.81 కోట్లు కేటాయించారు. ఇది 2015-16 కేటాయింపులు కన్నా 16 శాతం అధికం. మొత్తం ప్రణాళికా కేటాయింపుల్లో 42 శాతం పెరుగుదల ఉండగా, ప్రాధమిక రంగానికి ప్రణాళికేతర కేటాయింపుల్లో పెరుగుదల సుమారు 53 శాతం వరకూ ఉంది. 2016-17లో ప్రాధమిక రంగానికి ప్రణాళికా కేటాయింపు 10.027.51 కోట్లు ఇది గత ఏడాది బడ్జెట్ కంటే 3,473.41 కోట్లు అధికం. 160 ఏళ్ల క్రితం ధవళేశ్వరం వద్ద విజయవాడ వద్ద సర్ ఆర్ధర్‌కాటన్ నిర్మించిన ఆనకట్టలు అంతదాకా తీవ్ర దుర్భిక్ష పీడితాలైన కృష్ణా, గోదావరి జిల్లాలను భారతదేశానికి ధాన్యాగారాలుగా మార్చివేశాయి. మొత్తం ఆంధ్రాలో ముఖ్యంగా రాయలసీమలో, తక్కిన జిల్లాల కన్నా వెనుకబడిన ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అటువంటి సమూల పరివర్తనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గోదావరి జిల్లాలను సద్వినియోగం చేసుకునేందుకు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఐదున్నర నెలల రికార్డు వ్యవధిలో పూర్తి చేసి తద్వారా గోదావరి మిగులు జలాల్లో దాదాపు 80 టిఎంసిల జలాలు కృష్ణా డెల్టాకు అందుబాటులోకి తీసుకురావడానికి , తద్వారా శ్రీశైలం జలాలు రాయలసీమ జిల్లాలకు కేటాయించడానికి వీలు చిక్కబోతోంది. ఖరీఫ్‌లో కృష్ణా డెల్టాలోని 8.3 లక్షల ఎకరాలకు పట్టిసీమ పథకం ద్వారా 8.6 టిఎంసిల గోదావరి జలాలు పంటల ప్రాణం నిలిపాయి. జాతీయ నదుల అనుసంధాన పథకంలో భాగంగా పూర్తయిన మొదటి పథకం ఇదే. వెనుకబడిన జిల్లాల సాగునీటి సదుపాయం కల్పించడానికి ఏడు నీటి పారుదల పథకాలు అత్యంత ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తోటపల్లి బ్యారేజీ, పోలవరం కుడికాలవ, గాలేరు నగరి సుజల స్రవంతి, హంద్రీనీవా సుజల స్రవంతి పధకాలను 2016-17 నాటికి పూర్తి చేస్తామని ఆర్ధిక మంత్రి యనమల చెప్పారు. అలాగే వంశధార రెండోదశ, పూల సుబ్బయ్య వెలుగొండ పథకం, గుండ్లకమ్మ రిజర్వాయిర్, పోలవరం ఎడమ కాల్వను 2017-18లో పూర్తి చేస్తారు. పోలవరం మొదటి దశ పనులను 2018 జూన్ నాటికి పూర్తి చేస్తారు. 459 కోట్ల అంచనా వ్యయంతో 12 జిల్లాల్లో 1.2 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు లబ్ది చేకూర్చేలా 975 చెరువులను అభివృద్ధి చేస్తున్నారు. జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజన్సీ ద్వారా 291 కోట్ల వ్యయంతో అదనంగా 49,330 హెక్టార్లకు సాగునీరు అందుతుంది. ఇంతదాకా నిరుపయోగంగా పడి ఉన్న 175 ఎత్తిపోతల పథకాలను 134 కోట్ల వ్యయంతో పునరుద్ధరించడం ద్వారా 1.5 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12 జిల్లాల్లో 432 వాటర్‌షెడ్ పథకాలను అమలుచేస్తోంది. తద్వారా 2290 కోట్ల అంచనా వ్యయంతో 18.10 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సమగ్ర భూసార పరిరక్షం చర్యలను చేపడుతోంది. భారీ నీటిపారుదల, చిన్న తరహా నీటి పారుదలకు కలిపి జలవనరుల శాఖకు ప్రభుత్వం బడ్జెట్‌లో 7325.21 కోట్లు కేటాయించింది. 2015-16లో కేటాయించిన 4678.13 కోట్లకు ఇది 57 శాతం అధికం. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన పోలవరం కోసం 36660 కోట్లు కేటాయించారు. ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులను నిర్ధిష్ట కాలవ్యవధిలో పూర్తి చేయడానికి 3135.25 కోట్లు కేటాయించారు. చిన్న నీటిపారుదల రంగానికి ప్రణాళిక కేటాయింపులు 23 శాతం అధికంగా అంటే 674 కోట్లు ప్రతిపాదించారు. ఈ క్రమంలో వివిధ సాగునీటి పథకాలకు సైతం కేంద్రం నుండి సాయం అందుతుందని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది.