రాష్ట్రీయం

ఐసిస్ సానుభూతిపరులు ముగ్గురు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1.10 లక్షల నగదు, విమాన టికెట్లు స్వాధీనం
రిమాండ్‌కు తరలించిన సిసిఎస్ పోలీసులు
దర్యాప్తునకు ప్రత్యేక పోలీసు బృందం

హైదరాబాద్, డిసెంబర్ 28: నగరానికి చెందిన ముగ్గురు ఐసిస్ సానుభూతిపరులను అరెస్టు చేసినట్లు సిట్ (స్పెషల్ ఇనె్వస్టిగేషన్ టీమ్) సోమవారం అధికారికంగా ప్రకటించారు. వారి నుంచి డెల్ ట్యాబ్, ఇండిగో విమాన టికెట్లు, సుమారు 1.10లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నారు. సిరియాను కేంద్రంగా చేసుకుని ప్రపంచాన్ని వణికిస్తున్న ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన ముగ్గురు యువకులు శనివారం తెల్లవారు జామున నాగపూర్ విమానాశ్రయం వద్ద పట్టుబడిన విషయం విదితమే. వీరిలో చాంద్రాయణగుట్ట, హుమాయూన్‌నగర్‌కు చెందిన అబ్దుల్లా బాసిత్, సయ్యద్ ఒమర్ ఫారూఖ్ హుస్సేని, మాజ్ హసన్ ఫారూఖ్ ఉన్నారు. సోమవారం వీరిని రిమాండ్‌కు తరలించారు. వీరంతా ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితులై అఫ్గానిస్తాన్‌కు వెళ్లేందుకు నిశ్చయించుకున్నట్టు విచారణలో తేలిందని సిట్ పోసులు తెలిపారు. వీరిలో అబ్దుల్లా బాసిత్, మాజ్ హసన్ ఫారూఖ్ గత సంవత్సరం సెప్టెంబర్‌లో అఫ్ఘాన్ వెళ్లేందుకు ప్రయత్నించి కోల్‌కతలో పోలీసులకు పట్టుబడ్డారు. ఆ తర్వాత వీరిని నగరానికి తీసుకువచ్చి తల్లిదండ్రుల సమక్షంలో కౌనె్సలింగ్ నిర్వహించి వదిలిపెట్టామని, అంతే కాకుండా వీరిపై నిఘా కొనసాగించడంతో ప్రస్తుతం నాగ్‌పూర్‌లో మరోసారి అరెస్టయ్యారని పోలీసులు తెలిపారు.