రాష్ట్రీయం

ఐటి రంగం పరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీడ్కోలు - 2015 :తెలంగాణ
====================
తెలంగాణ ఆవిర్భావం తరువాత అందరి సందేహాలను పటాపంచలు చేస్తూ పలు ఐటి కంపెనీలు హైదరాబాద్‌పై మునుపటి కన్నా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయి. అమెజాన్, గూగుల్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, టాటా కన్సల్టెన్సీ వంటి సంస్థలు విస్తరణకు హైదరాబాద్‌ను ఎంచుకున్నాయి. విభజన సమయంలో ఐటిఐఆర్‌ను కేంద్రం ప్రకటించింది. ఐటిఐఆర్ వస్తే 15లక్షల మందికి ప్రత్యక్షంగా, 35లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. సాఫ్ట్‌వేర్‌తో పాటు హార్డ్‌వేర్ రంగం హైదరాబాద్‌లో అభివృద్ధి చెందే విధంగా ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.

మైక్రోసాఫ్ట్, గూగుల్... ఈ రెండు పేర్లను మినహాయించి ఐటి రంగాన్ని ఆలోచిస్తే కనిపించేది చీకటే. ప్రపంచాన్ని ఐటి రంగం శాసిస్తుంటే ఐటి రంగాన్ని శాసిస్తున్నది ఈ రెండు పేర్లు. ఈ సంవత్సరం ఈ రెండు పేర్లు తెలంగాణ ఐటి అభివృద్ధితో ముడిపడి ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదేళ్లతో ఐటి మంత్రి కెటిఆర్‌తో కలిసి టి-హబ్‌లో ఐటి కుర్రాళ్లతో సోమవారం ముచ్చటించారు. స్టార్టప్‌లతో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంపై సత్య నాదెళ్ల ప్రస్తావించారు. పెట్టుబడులకోసం అమెరికా పర్యటించి పలు కంపెనీల అధినేతలను కలిసి వచ్చిన కెటిఆర్ గూగుల్‌లో సైతం అడుగు పెట్టారు. అమెరికా తరువాత అంత పెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో పెట్టేందుకు చర్చలు సాగించారు. 2004లో టిడిపి ఓడిపోతే ఐటి రంగం భవిష్యత్తు ఏమిటి? అనే ఆందోళన కొందరిలో కనిపించేది. అయితే 2004 తరువాత హైదరాబాద్‌లో ఐటి రంగం మరింత వేగాన్ని పుంజుకుంది. బాబు హయాంలో కన్నా వైఎస్‌ఆర్ హయాంలో హైదరాబాద్ నుంచి ఐటి ఉత్పత్తుల మూడింతలు పెరిగాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత ఐటి భవిష్యత్తు ఏమిటి? అంటూ మళ్లీ అలానే సందేహాలు వ్యక్తం చేశారు. మళ్లీ అదే రిపీట్ అయింది. తెలంగాణ ఏర్పడిన ఏడాదిన్నర కాలంలోనే పలు అంతర్జాతీయ ఐటి కంపెనీలు హైదరాబాద్‌పై ఆసక్తి చూపించాయి. అమెరికా క్యాంపస్ తరువాత ఆసియాలోనే అతి పెద్దదైన క్యాంపస్‌ను గూగుల్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. భూమి కేటాయింపు వంటివి పూర్తయ్యాయి. హైదరాబాద్‌లో ఐటి అభివృద్ధికి బాబువేసిన పునాదులు, వైఎస్‌ఆర్ చూపిన చొరవ కెటిఆర్ కృషి అంటూ చెబుతూ పోతే అది హైదరాబాద్‌ను అవమానించడమే అవుతుంది. హైదరాబాద్ వాతావరణం, హైదరాబాద్ సంస్కృతి, హైదరాబాద్ నగరం ఐటి అభివృద్ధికి దోహదం చేయడంలో కీలక భూమికి. ఆ తరువాతే మిగిలిన వారి కృషి. హైదరాబాద్ వాతావరణం, పాలకుల కృషి రెండింటితో హైదరాబాద్‌లో ఐటి రంగం పరుగులు తీస్తోంది.
గతంలో ఐటి మంత్రి ఎవరైనా హైదరాబాద్‌లో ఐటి పరిశ్రమల అభివృద్ధి బాధ్యత మొత్తం ముఖ్యమంత్రులు స్వయంగా చూసుకునేవారు. తొలిసారిగా ఐటి మంత్రి ఐటి రంగం వ్యవహారాలు చూస్తున్నారు. పైగా అతను ఐటి నిపుణుడు కూడా గతంలో ఐటి మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారెవరికీ ఐటి రంగంలో పెద్దగా అనుభవం లేదు. అమెరికాలో ఐటి కంపెనీలో ఉద్యోగం చేస్తూ తెలంగాణ ఉద్యమ కాలంలో తిరిగివచ్చిన కెటిఆర్ హైదరాబాద్ ఐటి కలలకు ఏ మాత్రం విఘాతం కలగకుండా చూడడమే కాకుండా హైదరాబాద్ ఐటికి ఉజ్వల భవిష్యత్తు ఉందని చేతలద్వారా చూపిస్తున్నారు. దేశంలోనే అతి పెద్దదైన టి-హబ్‌ను స్వల్పకాలంలో నిర్మించారు. టాటా అధినేత సైతం టి-హబ్‌ను చూసి మురిసిపోయారు. మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదేళ్ల టి-హబ్‌లో ఔత్సాహికులను ఉద్దేశించి తన అనుభవాలను పంచుకోవడంతోపాటు స్టార్టప్‌లతోమైక్రోసాఫ్ట్ చేతులు కలుపుతుందని ప్రకటించారు. సత్య నాదెళ్ల హైదరాబాద్‌లో పర్యటించిన రోజే ఇన్ఫోసిస్ సిఇఓ విశాల్ సిక్కా ఐటి మంత్రి కెటిఆర్‌ను కలిసి పోచారం క్యాంపస్‌ను 25వేల మంది ఉద్యోగులు పని చేసే విధంగా విస్తరించనున్నట్టు ప్రకటించారు.
తెలంగాణ ఆవిర్భావం తరువాత సందేహాలను పటాపంచలు చేస్తూ పలు ఐటి కంపెనీలు హైదరాబాద్‌పై మునుపటి కన్నా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయి. అమెజాన్, గూగుల్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, టాటా కన్సల్టెన్సీ వంటి సంస్థలు విస్తరణకు హైదరాబాద్‌ను ఎంచుకున్నాయి. విభజన సమయంలో ఐటిఐఆర్‌ను కేంద్రం ప్రకటించింది. అయితే అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఐటిఐఆర్ వస్తే 15లక్షల మందికి ప్రత్యక్షంగా, 35లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ప్రభుత్వం ఐటిఐఆర్‌కోసం ప్రయత్నిస్తోంది. కాగ్నిజెంట్‌కు విస్తరణకోసం ఆదిభట్లలో 54వేల ఎకరాల భూమి కొనుగోలు చేసింది. ఇక్కడ పనె్నండు వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. 7500 మంది ఉద్యోగులతో ఉన్న గూగుల్ మరో ఐదువేల మందికి అదనంగా ఉపాధి లభించే విధంగా కోకాపేటలో 20 ఎకరాల్లో శాశ్వత క్యాంపస్‌ను నిర్మిస్తోంది.
ఐటి పరిశ్రమలతోపాటు విమానాలు, విమాన పరికరాలు, హెలికాఫ్టర్ల పరికరాల పరిశ్రమలు హైదరాబాద్‌లో స్థాపించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ సంవత్సరం ఈ రంగంలో కొంతవరకు వృద్ధి కనిపించింది. అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే హెలికాఫ్టర్‌లోని పరికరాలు సైతం హైదరాబాద్‌లో తయారుచేశారు అంటూ ఐటి మంత్రి కెటిఆర్ ఐటి కంపెనీల సభల్లో సగర్వంగా ప్రకటిస్తుంటారు. సాఫ్ట్‌వేర్‌తో పాటు హార్డ్‌వేర్ రంగం హైదరాబాద్‌లో అభివృద్ధి చెందే విధంగా ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. విశ్వనగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి పరచనున్నట్టు ప్రకటిస్తున్న ప్రభుత్వం ఆ మేరకు ప్రపంచంలోని పలు ప్రముఖ ఐటి కంపెనీలు ఆకట్టుకోవడంలో ఈ సంవత్సరం విజయం సాధించింది. ** టి-హబ్‌లో సత్య నాదెళ్లతో కెటిఆర్ **

- బుద్దా మురళి