రాష్ట్రీయం

ఖైదీల్లో పరివర్తనకు కళా ప్రదర్శనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: ఖైదీల్లో దాగివున్న ప్రతిభను వెలికితీసి వారిలో ఆత్మస్థయిర్యాన్ని నింపేందుకు జైళ్ల శాఖ చేస్తున్న కృషి ప్రశంసనీయమని తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఖైదీల్లోని వివిధ కళలను ప్రోత్సహించేందుకు అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారన్నారు. శుక్రవారం జైళ్ల శాఖ ఆధ్వర్యంలో స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఖైదీల పెయింటింగ్ ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ ప్రదర్శన కృష్ణకృతి ఆర్ట్ ఫౌండేషన్ సౌజన్యంతో మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో మూడు రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సందర్భంగా మంత్రి నాయిని మాట్లాడుతూ క్షణికావేశంలో నేరాలకు పాల్పడి జైళ్లలో మగ్గుతుంటారని, అలాంటి ఖైదీలలో మార్పు తెచ్చేందుకు జైళ్లశాఖ పలు సంస్కరణలతో ముందుకెళ్తోందన్నారు. జైళ్లలో నాలుగు గోడల మధ్య మగ్గుతున్న ఖైదీలు వైరాగ్యంగా ఉండకూడదన్నారు. వారిలో దాగివున్న కళలను మెరుగు పరచుకునేందుకు మంచి అవకాశం కల్పించి వారికి వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వడం ముదావహమన్నారు. జైలు అధికారుల ప్రోద్బలంతో ఖైదీల్లోని ప్రతిభను కనబరచుకునేందుకు పెయింటింగ్ వేయించారని, వాటిని ప్రదర్శనలో పెట్టడంతో ఖైదీల మానసిక ప్రవర్తనలో మార్పు వస్తుందన్నారు.జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ వికె సింగ్ మాట్లాడుతూ చంచల్‌గూడ జైల్లోని ఖైదీల్లో మంచి ప్రతిభ ఉందని, వారి ప్రతిభను చాటుకునేందుకు పెయింటింగ్‌లు వేయించామన్నారు. ఖైదీలు వేసిన వివిధ పెయింటింగ్‌లు ఎంతగానో ఆకర్షిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో డిఐజి నర్సింహ ఇతర అధికారులు పాల్గొన్నారు.