రాష్ట్రీయం

జవాన్‌ను అక్రమంగా నిర్బంధించిన పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుప్పం, ఫిబ్రవరి 14: దేశ సేవలో పాలుపంచుకుంటూ స్వగ్రామానికి వచ్చిన తన భర్తను అక్రమంగా పోలీసులు నిర్బంధించారని ఓ జవాన్ భార్య కుప్పం పోలీస్‌స్టేషన్ ఎదుట చంటిబిడ్డతో బైఠాయించిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణానికి చెందిన నారాయణ, కుప్పం మండలం గుత్తాలపల్లెకు చెందిన హైమావతికి ఐదేళ్ల క్రితం వివాహమైంది. నారాయణ డెహ్రడూన్‌లో మిలటరీ విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల తనకు ఆడబిడ్డ పుట్టిందన్న సమాచారంతో స్వగ్రామానికి వచ్చారు. అయితే భార్య హైమావతి బిడ్డతో పాటు తల్లిదండ్రుల వద్ద ఉండటంతో నారాయణ ద్విచక్రవాహనంపై శుక్రవారం సాయంత్రం బయలుదేరాడు. మార్గమధ్యంలో కుప్పం పోలీసులు ఆయనను అడ్డుకొని తనిఖీలు చేశారు. తాను డెహ్రాడూన్‌లో మిలటరీలో విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పి గుర్తింపుకార్డు చూపించారు. అయినప్పటికీ పోలీసులు పట్టించుకోకుండా దురుసుగా ప్రవర్తించారు. దీంతో వారి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి నిర్బంధించారు.
తన భర్త మూడు రోజులైనా రాకపోవడంతో హైమావతి నానా హైరానా పడింది. చివరకు అరెస్ట్ చేశారన్న విషయాన్ని తెలుసుకొని కుప్పం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. భర్తను ఎందుకు అరెస్ట్ చేశారన్న విషయంపై స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడంతో పోలీస్‌స్టేషన్ ఎదుట చంటిబిడ్డతో బైఠాయించింది. సుమారు 8 గంటలపాటు ఆమె స్టేషన్ ఎదుటే ఆందోళన కొనసాగింది. పలుమార్లు పోలీసులు ఆమెను తొలగించాలని ప్రయత్నించినా అక్కడే భీష్మించి కూర్చుంది. చివరకు పోలీసులు నారాయణను విడుదల చేశారు. తన భర్త చేసిన తప్పు ఏమిటో తెలపాలని ఆమె కోరినా సరైన సమాధానం లభించలేదు. దీనిపై తాను హైకోర్టుతో పాటు మానవహక్కుల సంఘాన్ని కూడా ఆశ్రయించనున్నట్లు వివరించింది. దేశ సేవలకు అంకితమవుతున్న జవాన్లకు ఇదేనా గౌరవమని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.