కడప

ఆర్‌ఎం ఆఫీస్ ఎదుట ఆర్టీసీ కార్మిక పరిషత్ ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,్ఫబ్రవరి 5: కడప రీజియన్‌లో ఉన్న పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక పరిషత్ నేతలు సోమవారం ఆర్‌ఎం ఆఫీసు ఎదుట నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా రీజనల్ కార్యదర్శి పురుషోత్తం, ప్రధానకార్యదర్శి వరహాలనాయుడు, రీజనల్ చైర్మన్ ఇవి నారాయణ, రీజనల్ గౌరవాధ్యక్షుడు గోవర్దన్‌రెడ్డి, వర్కర్స్,టీచర్స్ రీజనల్ అధ్యక్షుడు ఏపిజి రెడ్డి తదితరులు మాట్లాడుతూ కడప రీజనల్‌లోని అన్ని డిపోల్లో రద్దయిన సర్వీసులను పునరుద్దరించాలని, సంస్థ ఆదాయాన్ని పెంచాలని, కడప డిపోలోని సీఐ యూనియన్‌నాయకులను దూషిస్తున్నారనీ, అవమానకరంగా వ్యవహరిస్తున్న ఈమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కడప రీజియన్‌లో ఏఇ మెకానిక్ కార్మిక పరిషత్ యూనియన్‌తో సంబంధంలేనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కడప రీజియన్‌లో కడప డిపోలో దివ్యదర్శన్‌యాత్ర సర్వీసులకు వెళ్లే డ్రైవర్, కండక్టర్లకు ఫిక్స్‌డ్ చార్జ్‌డ్యూటీలను అప్పగించాలని కోరినా ఫలితం లేకుండా పోయిందని అందువల్ల సీనియారిటీ ప్రకారం దివ్యదర్శన్‌కు వెళ్లేందుకు బస్సులకు డ్రైవర్లను నియమించాలని కోరారు. గుర్తింపు సంఘం అనే నెపంతో పక్షపాత వైఖరి అవలంభిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కడప రీజియన్ గ్యారేజిలో కార్మికులకు రావాల్సిన ఇంక్రుమెంట్లు, ప్రమోషన్లు ఇప్పించేందుకు చొరవ చూపాలని కోరారు.