ఆంధ్రప్రదేశ్‌

విమర్శించినా ముందడుగే వేస్తాం:సీఎం జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు:విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటే విమర్శలు చేస్తున్నారని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన ప్రకాశం జిల్లా ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణో ఏర్పాటుచేసిన ‘మనబడి నాడు-నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు ఎక్కడ చూసినా ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి వచ్చిందని, నేటి బాలలే రేపటి పౌరులని, వారికి మరో పదేళ్లలో ఆంగ్ల చదువులు అందించకపోతే వారి భవిష్యత్తు ఏమిటని ఆయన ప్రశ్నించారు. కార్పోరేట్ చదువులకు కొమ్ముకాస్తారా అని విపక్షాలను ప్రశ్నించారు. ప్రపంచంతో పోటీపడేలా మన పిల్లలను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇలాంటి నిర్ణయాలను తీసకున్నప్పడు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని వాటిని అధిగమించి ముందుకు పోతామని అన్నారు.