రాష్ట్రీయం

చంద్రబాబే ‘కాల్’బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇది శాసనసభ కాదు, కౌరవ సభ
నిప్పులు చెరిగిన ప్రతిపక్ష నేత జగన్

హైదరాబాద్, డిసెంబర్ 17: కాల్‌మనీ, సెక్స్ రాకెట్‌లో నిందితులను ముఖ్యమంత్రి చంద్రబాబు కాపాడుతున్నారని, ఆయనకు ఒక్కరోజు కూడా రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. అసెంబ్లీ వాయిదాపడిన తర్వాత ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న అరాచక విధానాలపై రాజీలేని పోరాటం చేస్తామని ప్రకటించారు. కాల్‌మనీ నిందితులు ఆడవారి మాన ప్రాణాలతో చెలగాటమాడారని, వీడియోలు కూడా తీసి మహిళలను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. నా జీవితంలో ఇంత దారుణమైన వ్యక్తిని చూడలేదని, సభలో ఒకరోజు సస్పెండ్ చేయమని మంత్రి యనమల చెబితే, రెండు రోజులు సస్పెండ్ చేశారన్నారు. ఇలాంటి దుశ్శాశన, దుర్మార్గపు కౌరవ సభ మరొకటి ఉండదన్నారు. చంద్రబాబు అండదండలతో కాల్‌మనీ రాకెట్‌లో నిందితులు రెచ్చిపోతున్నారన్నారు. ఈ నిందితులతో చంద్రబాబు, ఇంటెలిజెన్స్ డిజి, టిడిపి ఎమ్మెల్యేలు దిగిన ఫోటోలు కూడా ఉన్నాయన్నారు. ఈ కేసులో ఒక ఎమ్మెల్సీ సొంత తమ్ముడే నిందితుడన్నారు. ఈ ఎమ్మెల్సీ, నిందితుడైన తమ్ముడు ఒక ఇంట్లో ఉంటారన్నారు. టిడిపి ఎమ్మెల్యేలపై ఎలాంటి కేసులు నమోదు చేయలేదని, విచారణ కూడా చేపట్టలేదన్నారు. టిడిపి ఎమ్మెల్యేల దారుణాలను ప్రశ్నించినందుకు మా పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం దారుణమన్నారు. కేసును నీరుగార్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీవ్యాపారులపై దాడులు చేస్తున్నారన్నారు. సెక్స్‌రాకెట్ బహిర్గతం కాకుండా చంద్రబాబు తిప్పలు పడుతున్నారన్నారు. తమ పార్టీ వైఖరిని బిఏసి సమావేశంలో స్పష్టంగా చెప్పామన్నారు. చంద్రబాబును కాల్‌బాబు, మనీ బాబు అని కూడా అనవచ్చన్నారు. ఈ కేసులో కీలక నిందితుడితో కలిసి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విదేశాలకు వెళ్లారన్నారు. కాని ఇంతవరకు ఆ ఎమ్మెల్యేను పోలీసులు కనీసం విచారించలేదన్నారు. చంద్రబాబు ఆశీస్సులతో పోలీసులు నిందితులను వదిలేశారన్నారు.