ఆంధ్రప్రదేశ్‌

జమ్మలమడుగులో జగన్ విస్తృత పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, డిసెంబర్ 26: వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శనివారం జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన జరిపారు. పలువురిని పరామర్శించారు. మరికొందరిని ఓదార్చారు. జమ్మలమడుగులో వైసిపి నేత మునిరెడ్డి కుమారుడు, కోడలిని ఆశీర్వదించేందుకు వెళ్లగా అక్కడే ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, మరికొంతమంది తెలుగుదేశం నాయకులు తారసపడ్డారు. అయితే ఎలాంటి పలకరింపులు లేకుండా ఎవరికి వారు మిన్నకుండిపోవడం గమనార్హం. మునిరెడ్డి కుమారుడిని ఆశీర్వదించే క్రమంలో వైకాపా నేతలను టిడిపిలోకి ఆహ్వానించేందుకు దేవగుడి సోదరులు సంప్రదింపులు జరిపేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో జగన్ అక్కడ ప్రత్యక్షం కావడంతో వారు కంగుతిన్నట్లు సమాచారం. దేవగుడి సోదరులు పార్టీ వీడనున్న నేపధ్యంలో క్యాడర్‌ను కాపాడుకునేందుకు జగన్ ముద్దనూరు, జమ్మలమడుగు ప్రాంతాల్లో స్థానిక నాయకులను వెంటబెట్టుకుని పర్యటించినట్లు స్పష్టమవుతోంది.