రాష్ట్రీయం

జన్మభూమి కోలాహలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిల్లాల్లో పాల్గొన్న మంత్రులు పలుచోట్ల నిరసనలు, బహిష్కరణలు

హైదరాబాద్, జనవరి 2: ఆంధ్రప్రదేశ్‌లో రాష్టవ్య్రాప్తంగా జన్మభూమి-మావూరు కార్యక్రమం విజయవంతంగా శనివారం మొదలైంది. లాంఛనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మభూమిని విజయనగరం జిల్లా బొండపల్లిలో ప్రారంభించారు. అనంతరం అధికారులతోనూ, గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సమస్యలను తొందరగా పరిష్కరించవచ్చని సూచించారు. కర్నూలు మండలం పంచలింగాల గ్రామంలో ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి జన్మభూమి ప్రారంభించారు. 12 లక్షలకుపైగా భూమి రికార్డులను డిజిటలైజ్ చేస్తున్నట్టు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం చదలవాడ గ్రామంలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, కలెక్టర్ అరుణ్‌కుమార్, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరావు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం సౌత్‌మోపూర్‌లో పురపాలక మంత్రి డాక్టర్ నారాయణ జన్మభూమిని ప్రారంభించారు. స్మార్టు విలేజ్, స్మార్టు వార్డుల అభివృద్ధే జన్మభూమి ఉద్దేశమని అన్నారు. ప్రకాశం జిల్లా మండ్లమూరు మండలం తూర్పుకమ్మపాలెంలో జరిగిన జన్మభూమిలో రవాణా మంత్రి శిద్ధారాఘవరావు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా వెంగళాయపాలెం జన్మభూమిలో మంత్రి రావెల కిశోర్‌బాబు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జన్మభూమిలో మంత్రి పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. నరసరావుపేటలో జన్మభూమి కార్యక్రమానికి గైర్హాజరైన ఆర్డీవో, తహసీల్దార్‌లపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో మంత్రి పీతల సుజాత పాల్గొన్నారు. పెద్దాపురం మండలం చదవలాడలో హోంమంత్రి చినరాజప్ప పాల్గొన్నారు. కుప్పంలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు. కాగా పలుచోట్ల జన్మభూమి సభల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. శృంగవరపుకోట మండలం ముసిడిపల్లిలో మూసేసిన పాఠశాలను తెరిపించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు జన్మభూమిని అడ్డుకున్నారు. భోగాపురం మండలం కౌలువాడలో జన్మభూమి గ్రామస్థులు బహిష్కరించారు. ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్‌పేట మండలం ముంజన్నపాడులో నిర్వహించిన జన్మభూమిలో రాజకీయవర్గాల మధ్య తోపులాట జరిగింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పాటూరులో జన్మభూమిలో పాల్గొనేందుకు వచ్చిన అధికారులను గ్రామస్థులు అడ్డుకున్నారు. తాగునీరు కల్పించాలంటూ ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారు. వెదురుకుప్పం మండలం పచ్చికాపులంలో జన్మభూమి రసాభాసగా మారింది. రెవిన్యూ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో జన్మభూమిని పారిశుద్ధ్య కార్మికులు అడ్డుకున్నారు. పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఆరు కోట్లతో మూడు నెలల్లో రహదారులను అభివృద్ధి చేస్తామని గుంటూరు జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రావెల చెప్పారు. విశాఖపట్టణం రైల్వే న్యూ కాలనీలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో హెచ్‌ఆర్‌డి మంత్రి గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. గత రెండు జన్మభూమి కార్యక్రమాల్లో 95.67 శాతం సమస్యలను పరిష్కరించినట్టు అధికారులు వెల్లడించారు. ఇంతవరకూ 34,87,546 ఆర్జీలు వచ్చాయన్నారు. వెబ్ సైట్‌లో జన్మభూమి ఆర్జీలను పరిష్కరించినట్టు చెప్పారు. రెవిన్యూ విభాగంపైనే 13,43,286 అర్జీలు వచ్చాయని వాటిలో 13,06,726 అర్జీలను పరిష్కరించామని చెప్పారు. పౌరసరఫరాల శాఖలో 7,25,371 దరఖాస్తులు అందగా, 6,98,518 దరఖాస్తులు పరిష్కరించి 12 లక్షల 43 వేల కొత్త రేషన్ కార్డులను మూడో విడత జన్మభూమిలో లబ్దిదారులకు జారీ చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో అత్యధికంగా కృష్ణా జిల్లా నుండి 5,80,246 అర్జీలు వచ్చాయని, చివరి స్థానంలో గుంటూరు జిల్లా ఉందని అధికారులు పేర్కొన్నారు.