జయహో

సక్సెస్‌ఫుల్ భార్యంటే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి భార్య, మంచి భర్త లాంటి పదాలు మీరు పూర్వమే విని ఉంటారు. కానీ ఆ ‘మంచి’ అనే ట్రేడ్‌మార్క్ జీవితంలో ఏమేరకు సరిపోతుంది? ప్రతి ఒక్కరికి పెళ్ళికి ముందో జీవితం, పెళ్ళి తర్వాతో జీవితం ఉంటాయి. ఈ రెండు జీవితాలకు ఉన్న తేడా ఏమిటి?
పెళ్ళికి ముందు అనుబంధాల్లో ప్రేమ, ఆప్యాయత, బాధ్యత అనే భావోద్వేగాలు పుట్టుకతో మొదలై పావు వంతు జీవితాన్ని నడిపిస్తాయి. ఇక్కడి బంధాల్ని మనం తప్పొప్పులు, పోలికలు లేకుండా ప్రేమిస్తాం. కారణం మనకు జన్మనిచ్చి, చదువులు చెప్పించి, ఓ మంచి జీవితానికి పునాదులు వేసే అనుబంధాల మిళితం పెళ్ళికిముందు జీవితం కనుక.
కానీ అప్పటికే యుక్తవయసుకు వచ్చి ఎవరూ మన జీవిత భాగస్వామిగా సరిపోతారు అనే అంశాన్ని వ్యక్తిగత, కుటుంబ, సమాజ కోణాల్లో ఆలోచించి తీసుకునే నిర్ణయమే పెళ్ళి. పరస్పర ఆకర్షణ, థ్రిల్, ఎక్సైట్‌మెంట్ వంటివి భార్యభర్తల మధ్య ఉండకపోతే యాంత్రికత జీవితాన్ని నింపేస్తుంది.
అప్పుడే కొత్త కుటుంబంలోకి కొత్త బాధ్యతలతో అడుగుపెట్టే అమ్మాయి ‘్భర్యగా బాధ్యతలు’అనే అంశం మీద నిజమైన స్పష్టత లేకపోయినా తన చుట్టుప్రక్కల వారిని చూసో, తను విన్నదో లేక తనకి తెలిసినదో లేక తల్లిదండ్రులో, అత్తమామలో చెప్పిన విషయాల్ని ప్రామాణికంగా తీసుకుని ముందుకు సాగుతుంది.
భర్త అప్పటికే ఓ ఉద్యోగి అయి ఉంటే అతను తన సంస్థకు బాధ్యుడు. ఆ బాధ్యతలతో మునిగితేలాక ఇంటి వాతావరణం అతనికి సుపరిచితమైనదే కనుక అతను చాలా మామూలుగా కొనసాగుతూ ఉండవచ్చు. కానీ భార్య పరిస్థితి వేరు. కొత్త వాతావరణం, కొత్త అనుబంధాలు, రోజంతా వారితో గడపాల్సి రావడం, అప్పటిదాకా పుట్టింట్లో ఉన్నంత సౌకర్యం కొత్తదనంవల్ల అత్తింట్లో లేకపోవడం... ఇలా ఎన్నో కారణాలవల్ల భార్య ఎలా ఉండాలి? ఎలా ఈ కొత్త వాతావరణంలో ఇమిడిపోవాలి? వంటి అంశాలతో మానసికంగా నలిగిపోతూ ఉంటుంది.
‘జూఒఆ జౄఔళఒఒజ్యశ జఒ ఇళఒఆ జౄఔళఒఒజ్యశ’’ అన్న సామెత మనందరికి తెలిసిందే. పెళ్ళైన కొత్తలో ఏర్పడిన అభిప్రాయాలే తర్వాత క్రమక్రమంగా స్థిరపడిపోతుంటాయి. సక్సెస్‌ఫుల్ భార్య ఆ కొత్తలోనే తనదైన ‘స్పెషల్ ఇంప్రెషన్’ను భర్తమదిలో ఏర్పడేలా చేస్తుంది. భార్యంటే ఒకవేళ గృహిణి అయితే వంట, ఇంటి పనులు, వర్కింగ్ వుమెన్ అయితే వీటితోపాటు ఆఫీసు పనులు నిర్వహిస్తే చాలదా? అని చాలామంది అనుకోవచ్చు. కానీ అది కచ్చితంగా సరిపోదు.
ప్రతి సక్సెస్‌కి కొన్ని సూత్రాలు ఉంటాయి. అలాగే సక్సెస్‌ఫుల్ భార్య అవ్వాలన్నా సరే కొన్ని సూత్రాలుంటాయి. అందులో మొదటి సూత్రం ఆసక్తిని అమలుపరచడం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తమను అందరూ ప్రత్యేకంగా చూస్తే బావుంటుంది అని ఉంటుంది. పెళ్ళైన కొత్తలో భార్య ఆ ఆసక్తిని భర్తపై కనబరచాలి. రోజుకి ఎనిమిది నుండి తొమ్మిది గంటలు ఆఫీసులో ఉండే భర్తచేసే ఉద్యోగ బాధ్యతలను గురించి కనీస అవగాహన ఏర్పరచుకోవాలి. అలాఅని పెళ్ళైన దగ్గరనుండి అతని ఉద్యోగం గురించి ప్రతి చిన్న విషయాన్ని అడుగుతూ నస అని అనుకునేలా చేయకూడదు.
నేడు అంతర్జాల మహిమవల్ల మనకు ప్రతి విషయం గురించి తెలుస్తుంది. దానిద్వారా ఉద్యోగం గురించి, దానిలో ఉండే ఒత్తిళ్ళ గురించి ప్రాథమిక అవగాహన ఉండేలా చూసుకుంటే, భర్త భాష భార్యకు అర్థం అవుతుంది. లేకపోతే ‘ఇంట్లో ఉండే దానివి నీకేం తెలుసు నా బాధలు, బాధ్యతలు?’ అనేటువంటి మాటలు గృహిణులు పడవలసి వస్తుంది.
(మిగతా వచ్చేవారం)

-శృంగవరపు రచన 99591 81330