ఆంధ్రప్రదేశ్‌

పోలీసులే ఫ్యాక్షన్‌ను ప్రోత్సహిస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* తాడిపత్రి ఎమ్మెల్యే జెసి ప్రభాకర్‌రెడ్డి

తాడిపత్రి, మార్చి 13: ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో పోలీసులే ఫ్యాక్షన్‌ను ప్రోత్సహిస్తున్నారని తాడిపత్రి ఎమ్మెల్యే జెసి ప్రభాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కిడ్నాప్, హత్యాయత్నం కేసులో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పినతండ్రి, వైకాపా నేత పెద్దారెడ్డిని పోలీసులే తప్పించారని ఆరోపిస్తూ శనివారం ఎమ్మెల్యే జెసి ప్రభాకర్‌రెడ్డి అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని రూరల్ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. అందులో భాగంగా స్టేషన్ ఎదుట అనంతపురం-కడప రహదారిపై వాహనాలను అడ్డంగా ఉంచి తన అనుచరులతో కలిసి రోడ్డుపై బైఠాయించి పోలీసులు డౌన్, డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యల్లనూరు మండలం శింగవరం గ్రామ సర్పంచ్ హరిత భర్త మోహన్‌నాయుడుని పెద్దారెడ్డి అనుచరులు ఈ నెల 8వ తేదీ కిడ్నాప్ చేసి, హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. ఈ ఘటనపై బాధితులు యల్లనూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, అయితే ఈ కేసులో కుట్రదారుడైన పెద్దారెడ్డిని పోలీసులే తప్పించారని మండిపడ్డారు. వెంటనే పెద్దారెడ్డిపై 307 కేసు నమోదు చేసి, అరెస్టు చేసేంత వరకూ కదిలే ప్రసక్తే లేదన్నారు. ధర్నా దాదాపు రెండున్నర గంటల పాటు కొనసాగడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి.
విషయం తెలిసిన వెంటనే డీఎస్పీ చిదానందరెడ్డి, అర్బన్, రూరల్ సిఐలు, ఎస్‌ఐలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ధర్నా విరమించాలని ఎమ్మెల్యేకు సర్దిచెప్పినా ససేమిరా అన్నారు. ఇక చేసేదేమీ లేక డీఎస్పీ ఈ విషయంపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయంపై ఐజి గోపాలకృష్ణ మాట్లాడుతూ ఆ కేసుపై డీఎస్పీ చిదానందరెడ్డితో విచారణ జరిపిస్తున్నామన్నారు. మూడు రోజుల్లో పెద్దారెడ్డిపై కేసు నమోదు చేస్తామని ఐజి ఫోన్ ద్వారా ఎమ్మెల్యే జెసి ప్రభాకర్‌రెడ్డికి హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.