రాష్ట్రీయం

జెఎన్‌యు ఘటనపై లాయర్ల ఘర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: జెఎన్‌యు, పటియాల హౌస్ కోర్టు వద్ద జరిగిన న్యాయవాదుల ఘర్షణలు, అరెస్టులకు నిరసనగా శుక్రవారం రాష్ట్ర హైకోర్టు వద్ద ఇరు వర్గాలుగా విడిపోయిన న్యాయవాదులు వాగ్వాదానికి దిగారు. కొందరు జెఎన్‌యు సంఘటనకు అనుకూలంగా, మరికొందరు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గొడవకు దిగడంతో పోలీసులు ఇద్దరు మహిళా న్యాయవాదులు సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.తెలంగాణ న్యాయవాదుల అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రఘునాథ్ మాట్లాడుతూ జెఎన్‌యు, పటియాల హౌస్ కోర్టు సంఘటనలను తీవ్రంగా ఖండించారు. కాగా రఘునాధ్ ఇచ్చిన ప్రకటనను మరో వర్గానికి చెందిన దాదాపు 100 మంది న్యాయవాదులు వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. దీంతో బార్‌కౌన్సిల్ కార్యాలయం వద్ద ఇరువర్గాలకు మధ్య గొడవ జరిగే అవకాశం ఉందని గ్రహించిన అక్కడ భద్రతగా ఉన్న పోలీసు సిబ్బంది కొందరిని కస్టడీకి తీసుకున్నారు.