రాష్ట్రీయం

జనాభా ప్రాతిపదికన బిసి నిధులు కేటాయించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర మంత్రులను కలిసిన జోగు రామన్న
హైదరాబాద్, డిసెంబర్ 21: తెలంగాణలో బిసి జనాభా సగానికి పైగా ఉన్నందున జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి గెహ్లట్‌ను బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న కోరారు. జోగు రామన్న, సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రులు గెహ్లట్, జవదేకర్‌లను కలిశారు. బిసి సంక్షేమం, ఉపకార వేతనాలను పెంచాలని కోరారు. బాలికల సంక్షేమ హాస్టల్ భవనాల నిర్మాణానికి సహకరించాల్సిందిగా కోరారు. అటవీ అనుమతులు లేనందున తెలంగఆంలో చాలా ప్రాజెక్టులు పెడింగ్‌లో ఉన్నాయని కేంద్ర మంత్రికి తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో మూతపడిన సిమెంట్ పరిశ్రమను తెరిపించాలని కేంఅదాన్ని కోరారు. అదే విధంగా తెలంగాణలో మూత పడిన పరిశ్రమలను తిరిగి తెరిచేందుకు సహకరించాలని కోరారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉండి పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులను కలువన్నుట్టు జోగు రామన్న తెలిపారు.