రాష్ట్రీయం

ఉత్తమ జడ్జిలకు నేడు అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జుడీషియల్ అకాడమీలో సమావేశం

హైదరాబాద్, జనవరి 2 : ఉత్తమ ట్రైనీ జుడిషియల్ ఆఫీసర్లకు జస్టిస్ ఎంఎన్ రావు గోల్డ్‌మెడల్స్ ఫర్ ఎక్సలెన్స్‌ను ఆదివారం అందిస్తున్నారు. ఈ మేరకు ఎపి జుడిషియల్ అకాడమి శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
అవార్డులకు ఎంపికైన వారి వివరాలు ఇలా ఉన్నాయి. వెంకట జ్యోతిర్మయి (సిబిఐ కేసుల ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి, విశాఖపట్నం), హరిహరనాథ శర్మ (్ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి, ఏలూరు)లకు 2010 ఫోర్త్ ఫౌండేషన్ కోర్స్‌లో ప్రతిభ కనబరిచినందుకు అవార్డులు ఇస్తున్నారు. బి. శ్రీదేవి (సెకండ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్, రంగారెడ్డి), కిరణ్ పాలకుర్తి (జూనియర్ సివిల్ జడ్జి) లకు 2011 సంవత్సరానికి 15 వ బేసిక్ కోర్సులో ప్రతిభ కనబరచినందుకు అవార్డులు అందిస్తున్నారు. డి. కిరణ్‌కుమార్ (ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, సూర్యాపేట, నల్లగొండ జిల్లా), కె. మాధవి (జుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్‌క్లాస్ ఫర్ రైల్వేస్, గుంటూరు) లకు 2012 సంవత్సరానికి 16 వ బేసిక్ కోర్స్‌లో ఉత్తమ ప్రతిభ కనబరచినందుకు అవార్డులు ఇస్తున్నారు.
అలాగే ‘ఉమెన్ రైట్స్ ఆర్ హ్యుమన్ రైట్స్-రోల్ ఆఫ్ జుడిషియరి టు ప్రొటెక్ట్ ది రైట్స్ ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్ చైల్డ్’ అన్న అంశంపై 2013 సంవత్సరానికి నిర్వహించిన వ్యాసరచన పోటీలో ఉత్తమంగా ఎంపికైన వారికి అవార్డులు ఇస్తున్నారు. ఉత్తమ వ్యాసానికి ఇచ్చే గోల్డ్ మెడల్‌కు జివి మహేష్ నాథ్ (ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి, సంగారెడ్డి) ఎంపికయ్యారు. ద్వితీయ ఉత్తమ వ్యాసానికి ఇచ్చే రజత పతకానికి కె. మురళిమోహన్ (అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి భీమునిపట్న, విశాఖ) ఎంపికయ్యారని జుడిషియల్ అకాడమి డైరెక్టర్ పి. శ్రీసుధ తెలిపారు.
ఏపి జుడిషియల్ అకాడమీలో ఆదివారం ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేసే ప్రత్యేక సమావేశంలో అవార్డులను ఇస్తున్నామని ఆమె వివరించారు.