రాష్ట్రీయం

కాపులను బీసీల్లో చేరిస్తే పోరాటం తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 24: కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం హంగు, ఆర్భాటం కలిగిన కాపులను బిసి జాబితాలో చేర్చటం వల్ల ప్రధానంగా స్థానిక సంస్థల్లో బిసిలకు ప్రాతినిధ్యం లేకుండా పోతుందని అందుకే కాపులను బిసి జాబితాలో చేరిస్తే పోరాటం తప్పదంటూ యాదవ మహాసభ జాతీయ అధ్యక్షుడు రామనంద యాదవ్, జాతీయ ఉపాధ్యక్షుడు అన్నా రామచంద్రయాదవ్, జాతీయ ప్రధాన కార్యదర్శి నత్తు నరేంద్రయాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ హెచ్చరించారు. వంద మందితో ఏర్పాటైన అఖిలభారత యాదవ మహాసభ రాష్ట్ర నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఆదివారం నగరంలో జరిగింది. దీనికి జాతీయ నాయకులు పలువురు ముఖ్య అతిథులుగా హాజరై రాష్ట్రంలో యాదవ మహాసభ అభివృద్ధికి దిశ, దశ నిర్దేశం చేశారు. రామానంద యాదవ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా ఉన్న యాదవులు ఐక్యంగా ఉండి రాజ్యాధికారం సాధించాలని, అలాగే యాదవుల హక్కుల కోసం నిరంతరం పోరాడి ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలన్నారు. జాతీయ సెక్రటరీ జనరల్ అశోక్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో యాదవుల అభివృద్ధికి జాతీయస్థాయిలో తమ వంతు పూర్తి సహాయ సహకారాలుంటాయని జాతీయ నాయకులు లల్లూప్రసాద్, ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్‌ల వంటి సహాయ సహకారాలు లభించగలవన్నారు. జాతీయ ఉపాధ్యక్షులు అన్నా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ కాపులను బిసి జాబితాలో చేరిస్తే యుపిలో గతంలో జయప్రకాష్ నారాయణ్, ములాయం సింగ్, కాన్షీరాం వంటివారు చేపట్టిన ఉద్యమాల తరహాలో ఇక్కడ కూడా ఉద్యమాలు చేపట్టగలమని హెచ్చరించారు. రాష్ట్ర నూతన అధ్యక్షుడు లాగా వెంగళరావు యాదవ్ మాట్లాడుతూ యాదవులు సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి కోసం యాదవ మహాసభ నిరంతరం పాటుపడుతుందన్నారు. కాపులు బిసి రిజర్వేషన్లలో పోటీచేస్తే స్థానిక సంస్థల్లో బిసి జాబితాలో ఉన్న 120 కులాలకు స్థానం లేకుండా పోతుందన్నారు.
అందుకే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ ఆలోచనను విరమించుకోవాలన్నారు.
ఈ సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నర్తు నరేంద్రయాదవ్, రాష్ట్ర నాయకులు ప్రత్యూష సుబ్బారావు, అశోక్ సామ్రాట్, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి, ప్రకాశం జడ్‌పి వైస్ చైర్మన్ బాలాజీ యాదవ్, వివిధ జిల్లాల నాయకులు ప్రసంగించారు.

100 మంది ప్రమాణ స్వీకారం
రాష్ట్ర నూతన అధ్యక్షునిగా ఎన్నికైన లాకా వెంగళరావు యాదవ్ (కృష్ణా)తో పాటు మొత్తం 100 మంది జాతీయ నాయకుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం జరిగిన ప్రతినిధుల సమావేశంలో నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. అధ్యక్షుని ఎన్నిక గత నెలలో తిరుపతిలోనే జరిగింది. తాజాగా సెక్రటరీ జనరల్‌గా ప్రత్యూష సుబ్బారావు (గుంటూరు), అడిషనల్ సెక్రటరీ జనరల్‌గా గుంపాటి అప్పారావు (విశాఖ), కోశాధికారిగా డి.రామ్మోహనరావు (విశాఖ), ఉపాధ్యక్షులుగా రాచగొర్ల వెంకటరావు (ప్రకాశం), నెర్సు రాంబాబు (పగో), ఆర్.వెంకటాద్రి (కృష్ణా), కలగ శ్రీనివాసరావు (శ్రీకాకుళం), జి.లక్ష్మీనర్సప్ప (అనంతపురం), తోట నారాయణ (గుంటూరు), బంగారు నాగయ్య (కడప), అశోక్ ఆనంద్ (చిత్తూరు), ప్రధాన కార్యదర్శులుగా అంగిరేకుల ఆదిశేషు (గుంటూరు), డి.నారాయణస్వామి (అనంతపురం), పట్టిబోయిన శివరామకృష్ణ (కృష్ణా), అంకం గోపి (తూగో), బాలకృష్ణ (కడప), కె.్ధనుంజయ (అనంతపురం), తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు.