ఆంధ్రప్రదేశ్‌

కొత్త ఇసుక విధానంలో డొల్లతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 12: రాష్ట్రప్రభుత్వం రకరకాల కసరత్తులు చేసి అమలుచేస్తున్న కొత్త ఇసుక విధానంలోని డొల్లతనం బయపడుతోంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కొత్త విధానంలో ఇసుక రీచ్‌ల వేలం ప్రారంభమైన నేపథ్యంలో ఈ లోపాలు వెలుగుచూస్తున్నట్టు తెలుస్తోంది. వినియోగదారులకు క్యూబిక్ మీటరుకు రూ.500కు మించకుండా ఇసుకను సరఫరాచేయాలన్న నిబంధనతో రాష్ట్రప్రభుత్వం కొత్త ఇసుక విధానంలో రీచ్‌లకు వేలం నిర్వహిస్తున్న సంగతి విదితమే. ఇలా క్యూబిక్ మీటరు గరిష్ఠంగా రూ.500కు మాత్రమే వినియోగదారుడికి అమ్మాల్సిన విధానంలో, వేలంలో పాల్గొనే దరఖాస్తుదారులు రాష్ట్రప్రభుత్వానికి ఎంత చెల్లిస్తారో ఇ ఆక్షన్, ఇ టెండరులో తెలియచేయాల్సి ఉంటుంది. ఇ ఆక్షన్, ఇ టెండరు విధానాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే అన్ని జిల్లాల్లోను ఇసుక రీచ్‌ల వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తున్న ఔత్సాహికులు ఎంఎస్‌టిసిలో రిజిస్టర్ చేసుకున్నారు. ఇ ఆక్షన్, ఇ టెండరు ప్రక్రియను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంఎస్‌టిసి)కి రాష్ట్రప్రభుత్వం బాధ్యతలు అప్పగించిన సంగతి విదితమే. ఎంఎస్‌టిసి సహకారంతో రాష్ట్ర గనులు శాఖ పశ్చిమగోదావరి జిల్లాతో పాటు రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో ఇప్పటికే కొన్ని రీచ్‌లకు కొత్త విధానంలో వేలం నిర్వహించినట్టు తెలుస్తోంది. కొత్త విధానంలోని వేలంలో ఆసక్తికరమైన అంశాలు చోటుచేసుకుంటున్నట్టు తెలుస్తోంది. వినియోగదారులకు క్యూబిక్ మీటరుకు రూ.500కు ఇసుక అమ్మాలన్న నిబంధనపెడితే, రీచ్‌ల వేలంలో పాల్గొన్న దరఖాస్తుదారులు క్యూబిక్ మీటరుకు రూ.500 లేదా అంతకన్నా ఎక్కువే రాష్ట్రప్రభుత్వానికి చెల్లించే విధంగా వేలంలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. సహజంగా ఒక క్యూబిక్ మీటరు ఇసుకను తవ్వి, ఒడ్డుకు తీసుకురావాలంటే కనీసం రూ.250 ఖర్చవుతుంది. అలాంటపుడు వినియోగదారుడికి క్యూబిక్ మీటరు ఇసుకను రూ.500కు అమ్ముతూ, లీజుదారుడు క్యూబిక్ మీటరుకు రూ.500 రాష్ట్రప్రభుత్వానికి ఎలా చెల్లింగలరన్న ప్రశ్న తలెత్తుతోంది. అంటే క్యూబిక్ మీటరుకు రూ.250 నష్టాన్ని భరించాలన్న మాట. ఎవరైనా వ్యాపారాన్ని అంతో ఇంతో లాభానికి చేస్తారే తప్ప, నష్టానికి చెయ్యరన్నది అందరికీ తెలిసిన విషయమే. అలాంటిది నష్టానికి ఇసుక వ్యాపారం చేసేందుకు దరఖాస్తుదారులు వస్తున్నారంటే దీని ఆంతర్యమేమిటో తెలుసుకోవటానికి పెద్దగా కష్టపడనవసరం లేదు. అసలు కన్నా అదనంగా వేలంలో రీచ్‌ను దక్కించుకోవాలనుకున్న వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో కొత్త ఇసుక విధానంలో రాష్ట్రప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. అసలు ధర కన్నా అదనంగా వేలం ధరను కోట్ చేసిన వారి టెండరు లేదా వేలాన్ని కనుక రద్దుచేయాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తే, న్యాయపరమైన చిక్కులు వస్తాయి. పోనీ అలాగే వదిలేద్దామంటే అక్రమ తవ్వకాలకు అడ్డూఅదుపూ ఉండదు. పరిస్థితి చూస్తుంటే కొత్త ఇసుక విధానం న్యాయపరమైన చిక్కుల్లో పడి మళ్లీ షరామామూలుగా రాష్ట్రంలో ఇసుక గందరగోళం చెలరేగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉత్తర్వుల్లోని డొల్లతనాన్ని సర్కారు ఎలా చక్కదిద్దుతుందోనని నిర్మాణ రంగం ఎదురుచూస్తోంది.