రాష్ట్రీయం

కన్హయ్యపై దాడి బిజెపి లాయర్ల పనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 26: జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో విద్యార్ధి నాయకుడు కన్హయ్య కుమార్‌పై జరిగిన దాడిలో పాల్గొన్న న్యాయవాదులు బిజెపికి చెందిన వారేనని పేర్కొంటూ అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ నేతలు ఫోటోలను విడుదల చేశారు. కన్హయ్య కుమార్‌ను ఫిబ్రవరి 12న అరెస్టు చేశారని, ఫిబ్రవరి 29 నాటికి ఆయనను అరెస్టు చేసి 17 రోజులు అవుతుందని, అదే కన్హయ్య కుమార్‌పై జరిగిన దాడిలో పాల్గొన్న న్యాయవాది యశ్‌పాల్ సింగ్‌ను ఫిబ్రవరి 23, రాత్రి 9 గంటలకు అరెస్టు చేశారని, అదే రోజు రాత్రి 11.30 గంటలకు బెయిల్‌పై విడుదల చేశారని, అంటే కేవలం పోలీసుల అదుపులో రెండున్నర గంటలు మాత్రమే గడిపారని, మరో న్యాయవాది విక్రం చౌహాన్ ఫిబ్రవరి 24న రాత్రి 8 గంటలకు అరెస్టు చేసి, అదే రోజు రాత్రి 8.30 గంటలకు బెయిల్‌పై విడిచిపెట్టారని ఆయన కేవలం అరగంట పాటు మాత్రమే పోలీసుల అదుపులో ఉన్నారని అంబేద్కర్ స్టూడెంట్స్, దళిత్ వాచ్ ప్రతినిధులు వివరించారు. దీంతోపాటు విక్రం చౌహాన్ సంబిత్ పాత్ర, రాజ్‌నాధ్‌సింగ్, అద్వానీలతో కలిసి ఉన్న ఫోటోలను కూడా వారు విడుదల చేశారు. ఈ ఫోటోలు బెయిల్ దక్కిన తీరు చూస్తే ప్రభుత్వం ఒక వర్గంపై ఎంత ఏకపక్షంగా వ్యవహరిస్తోందో తెలుస్తోందని వారు వివరించారు.