కడప

జంతుహింస నివారణకు చర్యలు చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప (కల్చరల్), మార్చి 19: జంతుహింసలు నివారించేందుకు రాష్ట్రప్రభుత్వం జారీచేసిన విధి విధానాలను పకడ్బందీగా అమలుచేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కెవి రమణ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ చాంబర్‌లో శనివారం సాయంత్రం జంతు హింస నివారణ జిల్లాకమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పశువుల క్రయ,విక్రయాలు, వాటిని వాహనాల్లో రవాణా చేసేటపుడు పాటించాల్సిన విధి విధానాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి జంతు సంరక్షణ చట్టం 100శాతం అమలయ్యేలా చూడాలన్నారు. పశువుల రవాణ, జంతు సంక్షేమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సంతల వద్ద సమాచారాన్ని తెలిపే ప్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. పశువుల రవాణాకు ఉపయోగించే వాహనంలో జిపిఎస్ తప్పక ఏర్పాటు చేయాల్సివుందన్నారు.
సంత జరిగే ఆవరణంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. పశువుల సంత ప్రాంతంలో పశువులకు తాగునీటి తొట్లు నిర్మించి అందులో పుష్కలంగా తాగునీటిని ఉంచాలన్నారు. పశువుల సంతలో పశువుల కొనుగోళ్లును మార్కెట్ కమిటీ నమోదు చేయాల్సివుందన్నారు. కాగా పులివెందుల, రాయచోటి, మైదుకూరు, రామాపురంలలో ఏర్పాటు చేసిన సంత స్థాయి పర్యవేక్షణ కమిటీలను ఈ సమావేశంలో అమోదంచడం జరిగింది. సమావేశంలో పశుసంవర్థకశాఖ జెడి వెంకట్రావు, డిఎస్పీ నాగేంద్రుడు, డిఇఓ ప్రతాప్‌రెడ్డి, టిడిసి బసిరెడ్డి, మార్కెటింగ్ శాఖ ఏడి శ్రీకాంత్‌రెడ్డి, కమిటీ సభ్యులు అబ్దుల్లా, వెంకటరత్నం, మోహన్ లాల్ జైన్ తదితరులు పాల్గొన్నారు.