AADIVAVRAM - Others

సంస్కృతి పరిరక్షణకు సంకల్ప దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డా.రజని మల్లాది ప్రఖ్యాత కూచిపూడి నర్తకి, గురువు, పరిశోధకురాలు. ఒకవైపు తల్లిగా, గృహిణిగా వ్యక్తిగత బాధ్యతలు నిర్వహిస్తూ, మరోవైపు దశాబ్దాలుగా కళాసేవ చేస్తున్నారు. డా.రజని మల్లాది బి.ఏ.లో ఇంకా ఎం.ఏ.లో స్వర్ణపతకం సాధించారు. నృత్య విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయం నుండి. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారి యంగ్ ఆర్టిస్ట్ స్కాలర్‌షిప్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, ఇంకా సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుండి, కూచిపూడిలో పిహెచ్.డి. చేశారు. నాట్యసుధ డాన్స్ అకాడెమీ 2003లో స్థాపించి, ఉత్తమ కళాకారిణులను తీర్చిదిద్దుతున్నారు.
గౌరవాలు: స్వర్ణ పతకం బి.ఏ. (నృత్యం) - 1994
స్వర్ణ పతకం ఎం.ఏ. (నృత్యం) - 1996
యంగ్ ఆర్టిస్ట్ స్కాలర్‌షిప్ (భారత ప్రభుత్వం)
జెఆర్‌ఎఫ్ - మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ - సారంగపాణి
పదాలపై.
ఎస్‌ఆర్‌ఎఫ్ - మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ - మధుర భక్తిపై -2017.
పిహెచ్.డి. - పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం - నృత్య విభాగం. జయదేవ అష్టపదులు పరిశోధనాంశం -2018.
మద్రాస్ తెలుగు అకాడెమీ, సంగీత నాటక అకాడెమీ, ఆంధ్రప్రదేశ్ కల్చరల్ అఫైర్స్ ఆధ్వర్యంలోనూ.. వందల నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.
రూపకల్పన - కొరియోగ్రఫీ
1.కళావందనం - భిన్నత్వంలో ఏకత్వం
2.సంస్కృతీ సౌరభం - తెలుగు వైభవం
3.శకుంతల - కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలంపై ఆధారితం
4.వసంత విలాసం - ఉగాది సందర్భంగా
5.విశ్వశాంతి
6.సంక్రాంతి శోభ
7.పుష్కర ప్రాశస్త్యం
పెళ్లికి ముందు తన తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చారు. పెళ్లి తరువాత భర్త ప్రోద్బలంతో ఇవాళ ఇంత ఎదిగాను అంటారీమె. పెళ్లి తరువాత భర్త, అత్తమామల ప్రోత్సాహం చాలా ముఖ్యం. లేకపోతే కళలు కుంటుపడిపోతాయి అంటారు. పెళ్లికి ముందు వేరు. పెళ్లి తరువాత వేరు. బాధ్యతలు పెరుగుతాయి. ఇది నృత్యంలోనే కాదు, ఏ రంగంలోనైనా సహజమే. మనోధైర్యం, ఆత్మబలం ఉంటే మహిళ ఏ రంగంలోనైనా పైకి వచ్చి ఎంతో రాణించగలదు. కళలు, సాంప్రదాయాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత. భారతీయ కళలు - సంస్కృతి అనేవి పరస్పరాధారితమైనవి. ఇవి కాపాడుకోవడంలోనే మన భవిష్యత్తు ముడిపడి ఉంది. ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక కళను నేర్పించాలి. అది ప్రొఫెషన్ కాకపోయినా, హాబీగా అయినాసరే పిల్లలకి నేర్పించాలి. అలా మన సంస్కృతిని రాబోయే తరాలకు పదిలంగా అందజేయగలమని అంటారు రజని.

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి