ఆంధ్రప్రదేశ్‌

రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుని : కాపు సామాజికవర్గాన్ని వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ తునిలో ఆదివారం చేపట్టిన కాపు ఐక్యగర్జన హింస కు దారితీసింది. తుని రైల్వేస్టేషన్‌లో ఆగిఉన్న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. మొదట ఇంజన్‌పై దాడి చేసినవారు ఆ తరువాత ఒక బోగీకి నిప్పు పెట్టడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. వరుసగా ఐదుబోగీలు దగ్ధమయ్యాయి. దీంతో రైలులో ఉన్న ప్రయాణికులు ఆందోళనకుగురై కిందకు దిగి ప్రాణాలు రక్షించుకున్నారు. మాజీమంత్రి, కాపు సామాజికవర్గ నాయకుడు ముద్రగడ పద్మనాభం సారథ్యంలో తునిలో ఆదివారం మధ్యాహ్నం బహిరంగ సభ జరిగింది. ఆ తరువాత ఆందోళన దారితప్పింది. సభ సజావుగా ముగిసిందని పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా పరిస్థితి చేయిదాటిపోయింది. కాగా ముద్రగడతో రైల్వేపోలీసులు చర్చలు జరుపుతున్నారు. రత్నాచల్ ప్రమాదంతో విశాఖ-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్నిరైళ్లు రద్దుకాగా మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోవైపు చెన్నై-కోల్‌కతా రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా నలుగురికి గాయాలయ్యాయి. అదనపు బలగాలు తునికి చేరుకుంటున్నాయి.