రాష్ట్రీయం

రాష్టప్రతితో తెలంగాణ సిఎం భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెసిఆర్‌తో పాటు కుటుంబ సభ్యుల హాజరు
ప్రణబ్ ముఖర్జీకి అమ్మవారి విగ్రహం,
పట్టు వస్త్రాలు, తీర్థ ప్రసాదాల అందజేత
హైదరాబాద్, డిసెంబర్ 28: వారం రోజులుగా చండీయాగం నిర్వహణలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. మెదక్ జిల్లా ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ముగిసిన చండీయాగ వైదిక ప్రక్రియలు పూర్తి అయిన తర్వాత సోమవారం ఉదయం నేరుగా కుటుంబ సభ్యులతో వేములవాడకు వెళ్లిన ముఖ్యమంత్రి అక్కడి నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. కరీంనగర్ రహదారి నుంచి నగరంలోకి ప్రవేశించిన ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి నేరుగా బొల్లారంలోని రాష్టప్రతి నిలయానికి చేరుకున్నారు. అక్కడ బస చేసిన రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని ముఖ్యమంత్రి తన కుటుంబ సమేతంగా వెళ్లి కలిశారు. అయుత చండీయాగానికి పూర్ణాహుతి చేయాల్సిన రాష్టప్రతి అక్కడ జరిగిన అగ్ని ప్రమాదం వల్ల ఆ కార్యక్రమాన్ని నిర్వహించకుండానే వెనుదిరిగి వచ్చిన విషయం తెలిసిందే. యాగశాల వద్ద జరిగిన స్వల్ప అగ్ని ప్రమాద ఘటన వల్ల పూర్ణాహుతి చేయలేకపోయిన ఘటనపై ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్టు తెలిసింది. దేశంలో ఎవరూ తలపెట్టని అయుత చండీయాగాన్ని మహా అద్భుతంగా నిర్వహించారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ను రాష్టప్రతి అభినందించినట్టు తెలిసింది.
** సోమవారం బొల్లారంలోని రాష్టప్రతి నిలయంలో ప్రణబ్‌ముఖర్జీతో సమావేశమైన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబ సభ్యులు **