రాష్ట్రీయం

రేపటినుండి హైదరాబాద్‌లో పిఎస్‌సి చైర్మన్ల సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రారంభ కార్యక్రమానికి సిఎం కెసిఆర్
గవర్నర్‌కు చక్రపాణి నివేదిక

హైదరాబాద్, జనవరి 2: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని పబ్లిక్ సర్వీసు కమిషన్ల చైర్మన్ల సదస్సు ఈ నెల 4వ తేదీన హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. జాతీయ సదస్సును తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించనుంది. ప్రారంభ కార్యక్రమానికి తెలంగాణ సిఎం చంద్రశేఖరరావు హాజరుకానున్నారు. 5వ తేదీ సాయంత్రం ముగింపు కార్యక్రమానికి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ హాజరవుతారు. వివిధ రాష్ట్రాల్లో రిక్రూట్‌మెంట్‌కు అనుసరిస్తున్న అత్యాధునిక విధానాలు, విజయవంతమైన పద్ధతులను ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీసు కమిషన్ సభ్యులు తెలుసుకునే వీలుంది. కాగా టిఎస్‌పిఎస్‌సి చైర్మన్ ఘంటా చక్రపాణి శనివారం గవర్నర్‌ను కలసి వార్షిక నివేదికను సమర్పించారు.
టిఎస్‌పిఎస్‌సి సభ్యుడిగా మన్మధరెడ్డి
తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ సభ్యుడిగా పాఠశాల విద్యాశాఖ అదనపు సంచాలకుడిగా పనిచేసిన బి మన్మధరెడ్డిని నియమించారు. కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ చక్రపాణితోపాటు ప్రస్తుతం 8 మంది సభ్యులున్నారు. మన్మధరెడ్డి నియామకంతో మొత్తం కమిషన్ బలం 10కి పెరిగింది. ప్రస్తుతం చింతలగట్టు విఠల్, డాక్టర్ బి చంద్రావతి, మహ్మద్ మతీనుద్దీన్ ఖాద్రీ, టి వివేక్, డాక్టర్ రామమోహన్‌రెడ్డి, మంగారి రాజేందర్, సిహెచ్ విద్యాసాగరరావు, ప్రొఫెసర్ చింతా సాయిలు సభ్యులుగా కొనసాగుతున్నారు.