కడప

పేదల సమస్యలు పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,(కల్చరల్)సెప్టెంబర్ 19: మీ కోసం కార్యక్రమంలో న్యాయం జరుగుతుందని సుదూర ప్రాంతాల నుంచి పేదప్రజలు వస్తారని వారికి సత్వరమే న్యాయం చేసి వారి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కెవి సత్యనారాయణ జిల్లా అధికారులకు తెలియజేశారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీకోసం భవన్‌లో డయల్ యువర్ కలెక్టర్, మీకోసం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానంగా ముసలి, దివ్యాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. వారి సమస్యలు పరిష్కారం కాకుంటే తిరిగి వ్యయప్రయాసాల కోర్చు ఇక్కడికి వస్తారన్నారు. పరిష్కారం చూపిస్తే ఇక్కడికి వారు రారని చెప్పారు. అలాగే వృధ్యాప్య, దివ్యాంగుల పెన్షన్లకు అర్హత కూడిన వారికి పెన్షన్ మంజూరులో జాప్యం చేయరాదన్నారు. ఒకరిమీద ఆధారపడకుండా జీవించేందుకు అధికారులు మేలు చేస్తారనే నమ్మకం వారిలో కల్పించాలన్నారు. భూ సమస్యలు, గృహాల మంజూరుకు సంబంధించిన ఫిర్యాదులు ప్రతివారం మీ కోసం కార్యక్రమంలో వస్తున్నాయని వాటి పరిష్కారానికి సంబంధించిన అర్జీలను స్వీకరించి వాటిని పరిశీలించి పరిష్కారం కోసం అధికారులకు బదిలీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి పలువురు వారి వారి సమస్యలను అర్జీల రూపంలో కలెక్టర్‌కు ఇచ్చారు. ఈకార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శే్వత, డిఆర్‌ఓ సులోచన, డిఆర్‌డిఏ, డ్వామా పిడిలు అనిల్‌కుమార్‌రెడ్డి, రమేష్ అధికారులు పాల్గొన్నారు.