కడప

ప్రజాసేవలో ఖైదీల పెట్రోలు బంకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,(క్రైమ్)సెప్టెంబర్ 19: కడప సెంట్రల్ జైల్ ఆవరణలో ఖైదీలు నిర్వహిస్తున్న పెట్రోలు బంకు 5సంవత్సరాల క్రితం ఏర్పాటైందని, ఇది దేశంలోనే మొట్టమొదటి ఖైదీలు నిర్వహించే పెట్రోలు బంకు అని కడప సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ లక్ష్మినరసయ్య అన్నారు. సోమవారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖైదీల సంక్షేమం కోసం పెట్రోలు బంకు ఏర్పాటు చేశామని స్వచ్చతకు మారుపేరుగా నిర్వహిస్తున్నామన్నారు. మొదట పెట్రోలు బంకును ఏర్పాటుచేసే సమయంలో ఎన్నో అపోహలు ఉన్నప్పటికీ అప్పటి అధికారులు ధైర్యంతో పెట్రోలు బంకును ఏర్పాటు చేశారని వారి ఆశయాలకు అనుగుణంగా ఖైదీలు నిజాయితి, నిబద్దతతో పెట్రోలు బంకును నిర్వహిస్తున్నారన్నారు. పెట్రోలు బంకులో నాలుగు షిఫ్టులుగా 22 మంది రోజుకు ఐదు గంటలపాటు పనిచేస్తున్నారన్నారు. ఒక్కొక్కరికి రూ.70లు వంతున వారి అకౌంట్లకు జమచేస్తున్నట్లు సగం వారు ఖర్చుపెట్టుకుని మిగతా మొత్తాన్ని వారి కుటుంబానికి పంపుకునే వెసులు బాటును కల్పించామన్నారు. కల్తీలేని స్వచ్చమైన పెట్రోలు కావడంతో రోజురోజుకు అమ్మకాలు పెరుగుతున్నాయన్నారు.
ఈ పెట్రోలు బంకును ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తర్వాత కాలంలో అనేక పెట్రోలుబంకులు ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జైలు అధికారులు వెంకటేశ్వర్లు, ఫణికుమార్, అయ్యవారురెడ్డి, తదితర జైలు అధికారులు, బంకు నిర్వాహకులు పాల్గొన్నారు.