కడప

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమలాపురం, సెప్టెంబర్ 19: ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లో ఆసక్తి చూపాలని ఎమీవో జాఫర్‌సాదిక్ కోరారు. ఆయన సోమవారం మండల పరిధిలోని పెద్దచెప్పల్లి హైస్కూల్ గ్రౌండ్స్‌లో యర్రగుంట్ల జోన్ యస్ జి యఫ్ కోకో,కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్దచెప్పల్లి పాఠశాలలో ఈ ఏడాది ఈ పోటీలు నిర్వహించడం స్వాగతించ విషయమన్నారు. ఇందు వల్ల గ్రామీణప్రజలు కూడా జోనల్‌స్థాయిపోటీలు చూసే అవకాశం ఏర్పడిందన్నారు. ఇక్కడ గెలుపొందే విద్యార్థులు జిల్లాస్థాయి పోటీలకు ఎంపికవుతారన్నారు. క్రీడల వల్ల విద్యార్థులు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. అలాగే గెలుపు, ఓటములను సమానంగా తీసుకుని విద్యార్థులు ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ కార్యదర్శి సుబ్బన్న, ఫిజికల్‌డైరక్టర్లు తిరుపాలరెడ్డి, బాబు, రామాంజనేయులు, ధర్మారెడ్డి, సుబ్బమ్మ, రమాదేవి, నరేశ్, గురువయ్య పాల్గొన్నారు.