కడప

వైకాపా గాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,సెప్టెంబర్ 19: ప్రతిపక్ష నేత, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సొంత జిల్లాలో ప్రత్యేక పురపాలక సంఘమైన రాజంపేట పురపాలక సంఘానికి మరోరెండునెలల్లో ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో వైసిపి అధిష్ఠానం ఇటీవల సర్వే నిర్వహించినట్లు తెలిసింది. ఆ సర్వేలో వైసిపిచే అనుకూల పరిస్థితులు నెలకొన్నట్లు తెలిసింది. అలాగే రాజంపేట పార్లమెంట్ సభ్యులు, వైసిపి నేత పివి మిథున్‌రెడ్డి ఇప్పటికే పలుమార్లు రాజంపేటలో పర్యటనలు జరిపి తనకువచ్చే పార్లమెంట్ అభివృద్ధి నిధులు రాజంపేటకే అధికపీట వేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా అధికార తెలుగుదేశంపార్టీకి పదేళ్ల తర్వాత అధికారం రావడం, గత సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో టిడిపికి రాజంపేట స్థానం ఒకటే దక్కింది. అయినా తెలుగుతమ్ముళ్లలో ఏమాత్రం మార్పు కన్పించలేదు. రాజంపేట అసెంబ్లీ సెగ్మెంట్‌లో టిడిపి తరపున గెలుపొందిన మేడా మల్లికార్జునరెడ్డికి విప్ పదవి ఇవ్వడం, ఆయనకు కొంత ప్రాముఖ్యత కల్పించినట్లు అయ్యింది. తెలుగుదేశంపార్టీలో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి ముఖ్యనేతలు, కార్యకర్తలు తమకు ప్రాముఖ్యత లభించడం లేదని పార్టీ అధిష్ఠానంపై కొంతమేరకు అసంతృప్తిగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో రెడ్డి, కాపులు, చౌదరీలు సామాజికవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతోంది. పురపాలక సంఘం చైర్మన్ అభ్యర్థికోసం ఆ మూడు సామాజికవర్గాల వారు తమ అనుచరగణాలకే దక్కించుకునేందుకు తీవ్రంగా పోరాడుతూ పార్టీ అధిష్ఠానంతోనే అమితుమి తేల్చుకునేందుకు సిద్దపడుతున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశంపార్టీ అధిష్ఠానం ఇక్కడి పరిస్థితులు అధ్యయనం చేసి ఇప్పటికే అధిష్ఠానం కూడా నేతలకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో పార్టీ విప్ మేడా వెంకటమల్లికార్జునరెడ్డి, మాజీ మంత్రి పి.బ్రహ్మయ్య, టిడిపి సీనియర్‌నేత జిఎన్ నాయుడు, ఆర్టీసీ మాజీ చైర్మన్ ఎద్దల సుబ్బరాయుడు, కాపుల కమిషన్ రాష్ట్ర సభ్యుడు మోదుగుల పెంచలయ్య, పారిశ్రామిక నేత రామకృష్ణనాయుడు, పారా సుబ్బనాయుడు, రైతు సంఘం రాష్టన్రేత శవాన వెంకటసుబ్బయ్య నాయుడు, బిసిల్లో మంచి సంబంధాలు కలిగిన ప్రముఖవైద్యులు సుధాకర్‌తోపాటు పలువురిలో ఐక్యత లోపించింది. అందర్నీ ఒకేతాటిపై నడిపించి రాజంపేట పురపాలక సంఘాన్ని చేజిక్కించుకునేందుకు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావును సోమవారం రాజంపేటకు పంపి సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధికారపార్టీకి ఓ పక్క బిజెపి, మరో పక్క జనసేన పార్టీలో తలనొప్పిగా మారడం, తెలుగుతమ్ముళ్ల కుమ్మలాటలతో అంతుపట్టడం లేదు. ఈనేపధ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి జిల్లాలోని ఎమ్మెల్యేలను, ముఖ్యంగా ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు ఎ.అమరనాధరెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో వార్డుల వారీగా బాధ్యతలు తీసుకుని జగన్ తన సత్తానిరూపించుకునేందుకు సర్వశక్తులు వడ్డే వ్యూహంలో ఉన్నారు. అన్ని రాజకీయపార్టీల బలాబలాలు పురపాలక సంఘం ఎన్నికలే తేల్చనున్నాయి.