కడప

మంత్రి గంటా మార్నింగ్ వాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, సెప్టెంబర్ 19: రాజంపేట పట్టణం ఉస్మాన్‌నగర్, మన్నూరు, న్యూబోయనపల్లె, ప్రధాన మార్కెట్ ఏరియా తదితర ప్రాంతాల్లో విప్ మేడా మల్లికార్జునరెడ్డితో కలిసి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం మార్నింగ్‌వాక్ చేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్యలోపంపై మున్సిపల్ అధికారులపై మంత్రి అసంతృప్తి వ్యక్తపరిచారు. పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉందని పేర్కొన్నారు. మురికికాలువలు మురికినీటిని తీసుకెళ్ళేందుకు వీలుగాలేవని, అవసరమైనచోట డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధిపరచాల్సిన అవసరాన్ని గుర్తించారు. ప్రధాన మార్కెట్‌లో వ్యాపారులకు అనుగుణంగా విప్ మేడా మల్లికార్జునరెడ్డి సూచన మేరకు మోడల్ మార్కెట్ నిర్మాణంకు వీలుగా అవసరమైన ప్రతిపాదనలతో ముఖ్యమంత్రి దృష్టికి త్వరలో తీసుకెళ్ళనున్నట్టు వివరించారు. వీధుల్లో రోడ్లు కూడా పాదచారులకు, వాహనాల రాకపోకలకు అనుగుణంగా మరమత్తులు చేయాల్సిన అవసరం కూడా ఉన్నట్టు మంత్రి తెలిపారు. మొదట ఆర్‌అండ్‌బి అతిధి గృహం నుండి ఉస్మాన్‌నగర్, ప్రధాన మార్కెట్, న్యూబోయనపల్లె, జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్, ఉర్డూ జూనియర్ కళాశాల తదితర ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలతో ముఖాముఖి సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మార్నింగ్‌వాక్‌లో ప్రజల నుండి వచ్చిన సమస్యలను సత్వరం పరిష్కరించాలని ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులను మంత్రి ఆదేశించారు. పలుచోట్ల పారిశుద్ధ్యం, మురికికాలువల నిర్వహణపై మంత్రి గంటా అసంతృప్తితో పాటు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మంత్రి వెంట మార్నింగ్ వాక్‌లో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో పాటు పట్టణ తెలుగుదేశం పార్టీ నేతలు, జిల్లాస్థాయి తెలుగుదేశం పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.