కడప

రాజంపేటలో టిడిపి జెండా ఎగురేద్దాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, సెప్టెంబర్ 19: రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపాలిటీ, కార్పోరేషన్ ఎన్నికలకు సంబంధించి రాజంపేట మున్సిపాలిటీపై వైకాపా ఆశలు పెట్టుకొని ఉందని, పార్టీ నేతలు ఐకమత్యంతో మెలిగి వైకాపా ఆశలకు గండికొట్టాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. సోమవారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో మున్సిపాలిటీలోని టిడిపి నేతలతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వైకాపా పార్టీ పరంగా రాష్టవ్య్రాపితంగా చేసుకున్న సర్వేలో ఒక రాజంపేట మున్సిపాలిటీపై ఆశలు పెట్టుకుందన్నారు. అయితే పార్టీ నేతలు సమన్వయంతో మెలిగి ఈ మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ మంచి మెజార్టీతో విజయం సాధించేలా చూడాలన్నారు. మున్సిపాలిటీలోని సమస్యలన్నింటిపై అధ్యయనం జరుగుతుందని, పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి విప్ మేడా మల్లికార్జునరెడ్డి నుండి నివేదికలు అందాయని, వీటన్నింటిపై త్వరలో చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. త్వరలో తిరిగి తాను రాజంపేటకు వస్తానని, వార్డుల వారీగా కూడా సమీక్షిస్తామన్నారు. మున్సిపాలిటీలోని ప్రజలందరి సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించే దిశగా పార్టీ నేతలు పనిచేయాలన్నారు. ప్రజలతో మమేకమవ్వాలని సూచించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఛైర్మన్ మొదలు కౌన్సిలర్ స్థానం వరకు ఎవరైనా పోటీ చేసేందుకు అడగవచ్చని, అలాంటి వారు పేర్లు ఇవ్వవచ్చని, అయితే ముఖ్యమంత్రి నేరుగా ఓటర్ల ద్వారా సర్వే చేసి అభ్యర్థిత్వం ఎంపిక చేస్తారన్నారు. అభ్యర్థిత్వం ఎంపిక పార్టీ అధిష్టానం చేసిన తరువాత నేతలంతా కలిసికట్టుగా తమ ఇంటిలోని వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని భావించి పనిచేయాల్సి ఉంటుందన్నారు. లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమన్వయం చేసుకుంటూ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్న విషయం గుర్తించాలన్నారు. నూటికి నూరుశాతం రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను, కార్పోరేషన్‌లను అధికార తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం తధ్యమన్నారు. ఈ సమావేశంలో రాజంపేట శాసనసభ్యులు ప్రభుత్వ విప్ మేడా వెంకట మల్లికార్జునరెడ్డి, మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య, కాపు వెల్ఫేర్ కార్పోరేషన్ డైరెక్టర్ మోదుగుల పెంచలయ్య, టిడిపి సీనియర్ నాయకుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, కడప టిడిపి నాయకుడు దుర్గాప్రసాద్, కడప ఆర్టీసి రీజనల్ మాజీ ఛైర్మెన్ యెద్దల సుబ్బరాయుడు, తెలుగుదేశం పార్టీ నేతలు అతికారి వెంకటయ్య, సోమలరాజు చంద్రశేఖర్‌రాజు, రాజంపేట పట్టణ పార్టీ అధ్యక్షులు టి.సంజీవరావు, రూరల్ అధ్యక్షులు ఎస్.బాపణయ్యనాయుడు, మాజీ మండలాధ్యక్షులు డాక్టర్ పారా సుబ్బానాయుడు మున్సిపాలిటీ పరిధిలోని పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీలో పారిశుద్ధ్యంపై మంత్రి అసంతృప్తి
రాజంపేట మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం విషయంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు అసంతృప్తిని వ్యక్తపరిచారు. పారిశుద్ధ్యం మెరుగు విషయంలో సరైన చర్యలు లేవన్నారు. అలాగే మురికి కాలువలను, మంచినీటి పైపులైన్లను అభివృద్ధిపరచాల్సి ఉందన్నారు. అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను కూడా మెరుగుపరచాల్సి ఉందన్నారు. రహదార్లను అభివృద్ధి పరచాల్సి ఉందన్నారు. ప్రధాన మార్కెట్‌లో సరైన వసతులు లేవన్నారు. మాడరన్ మార్కెట్‌గా అభివృద్ధి పరచుకోవాల్సి ఉందన్నారు. ఈ సమస్యలన్నింటిపై దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. మున్సిపల్ అధికారులు వార్డుల్లో ప్రతి రోజు ఒక గంట పర్యటించి సమస్యలను గుర్తించి సత్వరం పరిష్కారానికి చర్యలు గైకొనాల్సి ఉందన్నారు. ఇందుకు సంబంధించి మున్సిపల్ అధికారుల పర్యటనల వివరాలను తనకు వాట్సప్‌లో పెట్టాలని మంత్రి గంటా ఆదేశించారు.